మోజు పడ్డ మగువ 18

By | February 17, 2019
మరో నాలుగు నెలలకి కాబోలు రూపకు మాత్రం సులోచన లెటర్ రాసింది తను నెల తప్పినట్లు. రూపకే ఎందుకు ఉత్తరం రాసిందో ఊహించు" అంటూ ముగించింది అర్చన. సూర్యాదేవికి కూడా నవ్వాగలేదు. "ఇతరుల తెలివితో బాగుపడడమంటే అదే మరి" అర్చన నవ్వును ఆపుకుంటూ అంది. "మరి నువ్వూ చాలా తెలివైన పిల్లవిగదా, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే నువ్వేం చేస్తావో చెప్పు. ఇలాంటి క్రిటికల్ పొజిషన్ లో నువ్వెప్పుడైనా చిక్కుకున్నావా?" "నిజానికి నేను యెదుర్కొన్న కష్టాలు అతి భయంకరమైనవి. ఇప్పుడంటే ఏదో సర్దుకున్నాం గానీ మూడేళ్ళ ముందు అన్నీ ఒక్కసారి చుట్టుముట్టేశాయి. ఒంటరిగా అన్నిటినీ ఎదుర్కొన్నాను. సునీల్ ఒక్కడే నాకు అప్పుడు చేదోడు వాదోడుగా వున్నాడు" అని శూన్యంలోకి చూస్తోంది అర్చన. "సునీల్ ఎవరే? నీ భర్త పేరు మహేష్ కదా" "సునీల్ ఎవరని అడక్కు? అది నా శీలానికి సంబంధించిన విషయం" అని నవ్విందామె. "ఫరవాలేదులేవే చెప్పు" "అయితే చెప్పాల్సిందేనా! కాఫీ చెప్పు. కాఫీ తాగాక చెబుతాను. తరువాత నువ్వు ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయాలి- చివరికి నీ భర్తకి కూడా" "అలానేలేవే" అని సూర్యాదేవి ఆమె చేతిలో చెయ్యివెసిఉ ఒట్టు పెడుతున్నట్లు గిల్లింది.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *