అమ్మాయి ప్రేమ పరిణయం 43

By | March 17, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 43 "నేను ఒకసారి తాతయ్యని చూస్తాను" అంటూ ముందుకి కదలబోయాడు యశ్వంత్ "వద్దు నువ్వు ఇక్కడికి వచ్చావని వాడికి తెలీదు. నేను నీకు విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తా అని అంటే "అలా చేస్తే నేను నీతో మాట్లాడను. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను" అని మొండి పట్టు పట్టి కూర్చున్నాడు. నిన్ను పిలవనని చెప్తే గానీ వాడు శాంతించలేదు. కానీ నాకే మనసొప్పక నిన్ను పిలిచాను. నీకీ విషయం చెప్దామని. నువ్వు ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిందంటే వాడు నాతో మాట్లాడడు." అన్నారు యశ్వంత్ చేతిని పట్టుకొని ఆపుతూ యశ్వంత్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. అతని అసహనాన్ని తెలుపుతూ అతని వేళ్ళు అతని జుట్టులోకి వెళ్ళాయి. వెంకట్రామయ్య గారు కొనసాగిస్తూ "నువు మీ తాతయ్య ని చూడాలనుకుంటే ప్రణవి తో పాటు రా. లేదు అంటే ఇంక మళ్ళీ ఇక్కడికి రాకు" అని చెప్పి కిందకి దిగి వెళ్ళిపోయారు. యశ్వంత్ కొంతసేపు అలాగే ఉండి ఆ తరువాత ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యశ్వంత్ వెళ్ళిపోయాక వెంకట్రామయ్య గారు రఘుపతి గారి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే అక్కడ నందిని, సౌజన్య ఉన్నారు. వాళ్ళు జరిగింది తలచుకొని నవ్వుకుంటున్నారు. ఈలోగా డోర్ సౌండ్ విని రఘుపతి గారు మంచం మీద నుండి లేచి కూర్చుంటూ "ఏమయింది ఏమన్నాడు" అన్నారు ఆయన కూడా నవ్వుతూ "మనం అనుకున్నదే...మహా అంటే ఇంకో రెండు మూడు రోజులు..అంతే...నీకు బాలేదనగానే చాలా భయపడి పోయాడు. నువ్వు వాడిని చూడడానికి ఇష్టపడడం

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *