అమ్మాయి ప్రేమ పరిణయం 52

By | March 27, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 52 ముక్త కి మెలుకువ వచ్చేటప్పికే బస్ వాళ్ళ ఊరు చేరుకుంది. ఆమె నెమ్మదిగా లేచి డ్రస్ సరి చేసుకొని తన లగేజ్ సరి చూసుకొని దగ్గర పెట్టుకుంది. బస్ సరిగ్గా పది నిమిషాల్లో వాళ్ళ ఊరి బస్ స్టాప్ లో ఆగింది. అప్పటికి ఉదయం ఆరు గంటలయ్యింది. దిగుతున్న ప్రయాణికులతో పాటు ఆమె కూడా బస్ దిగింది. బస్ స్టాప్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కనీసం అరగంట పడుతుంది. వాళ్ళ ఊరు అటు పల్లెటూరికి ఇటు పట్నానికి మధ్యలో ఉంటుంది. ఒక రకంగా అది ఒక టౌన్ అని చెప్పొచ్చు. బస్ స్టాండ్ నుండి ఆటో మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పిటికే హరిప్రసాద్ గారు బయట వాకిట్లో మొక్కలకి దగ్గరలో అరుగు మీద వీల్ చైర్ లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. గేట్ చప్పుడు కాగానే వచ్చింది ఎవరా అని తలెత్తి చూసారు. ముక్త గేట్ తెరుచుకొని లోపలికి వస్తూ కనిపించింది. ముక్త ని చూడగానే ఆయన నవ్వుతూ "రామ్మా రా ఎలా ఉన్నావు" అని అడిగారు. "నేను బావున్నా బాబాయి మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది" "బానే ఉన్నానమ్మా...లోపలికి పద నీకొసం మీ పిన్ని ఎదురు చూస్తోంది" అన్నారు. ముక్త తన చేతిలో ఉన్న సామాను తీసుకొని లోపలికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ పిన్నిని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. ముక్త అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ "ఇలా మాట్లాడుతూ ఉంటే టైం గడిచిపోతుంది గానీ నువ్వెళ్ళి స్నానం చేసి రా మిగితా విషయాలు తరువాత మాట్లాడుకుందాం" అని వాళ్ళ పిన్ని అనడంతో సరే అని వెళ్ళింది ముక్త. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ వసారాలో అరుగు మీద కూర్చున్నరు. హరిప్రసాద్ గారు వీల్ చైర్ లో కూర్చున్నారు ఆయన పక్కన వాళ్ళావిడ కింద

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *