ఇదీ కధ 15

By | November 27, 2019
telugu stories kathalu novels books ఇదీ కధ 15 "ఇంత ఆలోచించారా డాక్టర్!" "నిజమే! అంత దూరం ఆలోచించే వయసు కాదప్పుడు . ముక్కు పచ్చలారని పసిబిడ్డను నేను తప్ప నా అనేవాళ్ళు లేని ఆ పసిగుడ్డును చూస్తుంటే అలా నాలో ఎన్నో ఊహలు మేదిలేవి. సుజాత నా గుండెల మీదే పెరిగి పెద్దదయింది. నా బిడ్డ వేసే ప్రతి అడుగుకూ, పలికే పలుకుకూ తన్మయత్వం పొందేవాడ్ని! నా బిడ్డ కళ్ళ ముందున్నప్పుడు నాకు మరో పెళ్ళి ఆలోచనే వచ్చేది కాదు. పిల్ల నాకు దూరంగా పెరిగి ఉంటె ఏం చేసి ఉండే వాడినో ఇప్పుడు చెప్పలేను." "సుజాత తల్లి వైపు బంధువులు ఎవరూ లేరా? అమ్మమ్మా- మేనమామలు గాని ఎవరూ లేరా?" "లేరు! సుజాత తల్లి ఒక శరణాలయం నుంచి వచ్చింది!"     15 డాక్టర్ మూర్తి, సాంబశివరావు భోజనాలు ముగించుకొని డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు. సుజాత యాపిల్ ముక్కలు తెచ్చి, ప్లేట్స్ లో సర్ది వాళ్ళ ముందు పెట్టింది. "ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా!" సుజాతను చూస్తూ ఆప్యాయంగా అన్నాడు సాంబశివరావు. "ఈటే ప్రూట్ ఆప్టర్ మీల్స్ అంటారు అంకుల్!' అన్నది సుజాత. "అవన్నీ డాక్టర్లు చెప్పే మాటలు! ఈ దేశంలో ఒక్క పూట కూడా తిండికి గడవని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నవాడి ఆరోగ్యం కోసం చెప్పే మాటలమ్మా అవి!" నవ్వుతూ అన్నాడు సాంబశివరావు. "పోలీసు ఆఫీసర్ కూడా సోషలిజాన్ని గురించి మాట్లాడితే ఇహ దేశామేమయి పోయేట్టు?" డాక్టర్ మూర్తి బిగ్గరగా నవ్వాడు. "సోషలిజం గురించి మాట్లాడటంఓ ఫాషన్ అయి పోయింది నాన్నా!' అందరూ నవ్వుకున్నారు. "లేనివాడు ఎటుతిరిగి తినలేడు. ఉన్నవాడయినా పుష్టికరమైన ఆహారం తినమని మా డాక్టర్లు సలహా ఇస్తుంటారు!" 'అలా తింటూ రెండో వైపున బీదవాడి మీద సానుభూతి చూపిస్తూ వుంటే వాడు ఉన్నవాడి మీద తిరగబడడు'. అంతేనా మీ ఉద్దేశ్యం అంకుల్!' సుజాత కళ్ళు మెరిపిస్తూ అడిగింది. సాంబశివరావు సుజాతను చూస్తూ అనుకున్నాడు. ఈ పిల్ల చాలా తెలివి కలది. మాటకు మాట విసరగలదు. కాని ఆమె ఫిలాసఫీ ఏమిటో అర్ధం కాలేదు. "ఇంతకీ అమ్మాయ్? నువ్వు ఎవరి పక్షం?" అడిగాడు సాంబశివరావు. 'అంటే?" కనురెప్పలు టపటప లాడించింది సుజాత. 'నువ్వు కమ్యునిస్టులను బలపరుస్తావా? కాపిటలిస్తుల్ని బలపరుస్తావా?" 'అచ్చంగా పోలీసాఫీస్ లా ప్రశ్నించారు అంకుల్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పటం అంటే మీ లిస్టులో కి ఎక్కడమే!" 'పోనీ నీకు కాబోయే మామగానే సమాధానం చెప్పు సుజా!' డాక్టర్ మూర్తి నవ్వుతూ అన్నాడు. "మామ అయినా తండ్రి అయినా పోలీసాఫీసర్ పోలీసాఫీసరే! పోలీసువాడ్ని .....ఇంకేవడ్నో గుర్తు రావడం లేదు డాడీ........నమ్మవద్దన్నారు!" "ఇంకెవర్నో కాదమ్మా డాక్టర్నే!" అంటూ సాంబశివరావు డాక్టర్ మూర్తి కేసి చూశాడు. "వండర్ ఫుల్! బాగా చెప్పారు అంకుల్!' సుజాత చిన్నపిల్లలా చప్పట్లు కొట్టింది. పెద్దగా నవ్వుతూ. 'అయితే మీ ఇద్దర్ని నమ్మకూడదన్న మాట!' అన్నది సుజాత. 'అంతే! అంతే!' అన్నాడు సాంబశివరావు. "మనవ సేవే చేసే మా డాక్టర్లను కూడా మీతో కలపడం అన్యాయం సాంబశివరావు గారూ!' అన్నాడు డాక్టర్ మూర్తి. "అంకుల్ నిజం చెప్పాలంటే నాకు పాలిటిక్స్ మీద ఇంటరెస్ట్ లేదు. అవి పరమ బోర్! భగవంతుడు యీ జీవితాన్ని ప్రసాదించాడు. హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపటమే న లక్ష్యం. భగవత్ ప్రసాదితమైన జీవితాన్ని దుర్వినియోగం చేయడం మహాపచారం. ఇదే లైన్స్ మీద మా కాలేజి ఎలక్యుషన్స్ కాంపీటీషన్ లో మాట్లాడాను. నన్ను అపోజ్ చేస్తూ మాధవి మాట్లాడింది. అడియన్సంతా నావైపు ఉన్నారు. జడ్జేస్ మాత్రం మాధవి వైపు ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ మాధవికి , సెకండ్ నాకూ ఇచ్చారు. జడ్జిమెంట్ ప్రకటించినప్పుడు ఆడియన్స్ అంతా గోల చేసారు. ఈజ్ ఇన్ టిట్ డాడీ" అంటూ సుజాత తండ్రి వేపు చూసింది. ఇంతలో ఫోన్ మోగింది. 'అమ్మా! ఫోన్ చూడమ్మా!' సుజాతకు పురమాయించాడు డాక్టరు. కూతురు ధోరణి అతిగా సాగుతుందేమోనని , సాంబశివరావు ఏమనుకుంటున్నాడో అని బాధ పడుతున్న డాక్టర్ మూర్తికి కూతురు ధోరణిని ఆపడానికి వీలు చిక్కింది. 'అంకుల్! మీకే!" సుజాత సాంబశివరావు ను చూసి అన్నది. సాంబశివరావు లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. అవతలి నుంచి అర్దర్లీ విక్టర్ మాట్లాడుతున్నాడు. 'సార్!సాగర్ బాబు బయటికి వెళ్ళిపోయారు. బాబును ఫాలో కమ్మంటారా?" "ఫూల్! ఎలా ఫాలో అవుతావ్! సాగర్ కారులో వెళితే." "కార్లో వెళ్ళలేదు సార్?" "ఎందుకని?" "ఫ్రంట్ టైర్ లో గాలి తీసేశాను. సాగర్ బాబు కారు బయట పెట్టమన్నప్పుడు గేరేజిలో కెళ్ళి గాలి తీసి వేశాను. సాగర్ బాబు గేరేజి దగ్గరకు వచ్చేసరికి ఆ పని పూర్తి చేసి టైర్ ప్లాట్ అయిందని చూపించాను ." "గుడ్! అయితే సాగర్ నడిచే బయటికి వెళ్ళాడన్న మాట! యు కెన్! ఫాలో హిం విక్టర్!" "నో సార్?" "వాట్?" "సాగర్ బాబు నా సైకిలు అడిగి తీసుకొని దాని మీద వెళ్ళారు!" "సైకిల్ మీదా?" "అవును సార్!" "వాడెప్పుడూ సైకిల్ మీద వెళ్ళలేదు. పైగా వాడి మనసేమీ బాగాలేదు. నువ్వు వెంటనే టాక్సీ తీసుకుని సైకిల్ ను వెంబడించి చూడు. నేను ఇప్పుడే బయలుదేరి ఇంటికి వస్తాను. సాగర్ ఎక్కడికి వెళ్ళింది తెలుసుకొని ఇంటికి ఫోన్ చెయ్యి!' సాంబశివరావు రిసీవర్ పెట్టేశాడు. "ఏమైంది?" డాక్టర్ ఆదుర్దాగా అడిగాడు. సాంబశివరావు చెప్పాడు. డాక్టర్ మూర్తి ఓ క్షణం అలోచించి అన్నాడు. "మనం వెంటనే రామనాధం గారిని చూడటం మంచిది." 'ఇప్పుడా? ముందు సాగర్ ఎమైనాడో చూడాలిగా" "డోంట్ వర్రీ, నా ఉద్దేశ్యం మీ కర్ధమయిందనుకుంటాను. సాగర్ రామనాధం గారింటికే బయలుదేరి ఉంటాడు. సాగర్ జడ్జి గారింటికి వెళ్లేముందే మనం వెళ్ళడం మంచిది. రామనాధం గారిల్లిక్కడకు బాగా దగ్గర కదా! మీ బంగాళా నుంచి సాగర్ సైకిల్ మీద వెళ్ళే లోపున మనం కారులో వెళ్ళొచ్చు, కమాన్ హరియప్!' అంటూ డాక్టర్ మార్తి సాంబశివరావును వెంట బెట్టుకొని డ్రాయింగ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. తమ వెనుకే వస్తున్నా కూతురిని చూసి "నువ్వెక్కడికమ్మా? నువ్వు ఇంట్లోనే ఉండు" అన్నాడు డాక్టర్ మూర్తి. "సాగర్ కు ఏమైంది నాన్నా?" సుజాత అయోమయంలో పడిపోయింది. "సాగర్ బాగానే ఉన్నడమ్మా! నువ్వేమీ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *