ఇదీ కధ 4

By | November 21, 2019
ఇదీ కధ 4 సాగర్ ఆలోచనలో పడ్డాడు. సుజాత ఇంతవరకూ తన తల్లి దగ్గర ఏం చేస్తున్నది? వాళ్ళ నాన్నతో ఎందుకు వెళ్ళలేదు? డాక్టరు గారు కావాలనే కూతుర్ని వదిలి వెళ్ళాడా? ఆలోచిస్తూ తల్లి గదిలోకి ప్రవేశించాడు. "అడుగో! వచ్చాడమ్మా! నాయనా సాగర్! సుజాతను దిగబెట్టిరా నాయనా!--" భారంగా శ్వాస పీల్చుకుంటూ అన్నది సుభద్రమ్మ. "సుజాతా! మీ నాన్నగారితో వెళ్ళకుండా యింత వరకూ నువ్విక్కడెం చేస్తున్నట్టు?" "ఏం వుండకూడదా?" కళ్ళు తిప్పుతూ అడిగింది సుజాత. "అదేమిట్రా! అలా అంటావు/ ఎవరికి పట్టకపోయినా నా తల్లి సుజాతే నయం రా! పాపం పిచ్చిపిల్ల నన్ను చుట్టుకు చుట్టుకు తిరుగుతుంది. నేనంటే అమ్మాయికీ ప్రాణం. మీ పార్టీ గొడవల్లో మీరున్నారా! అక్కడ కూర్చోలేక లోపల కొచ్చాను. సుజాత అప్పట్నుంచి నాకు మందు మాకూ ఇస్తూ సేవలు చేస్తూ కూర్చున్నది రా! పైగా ఇంకా ఎందుకున్నావని అడుగుతావెం రా?" "అబ్బ ప్రతిదానికి సాగ దీస్తావెందుకే? సుజాత వెళ్ళలేదా అని అడిగాను! అంతేలేవే?" సుజాత లేచి వ్యానిటీ బ్యాగు తీసుకొని సుభద్రమ్మని చూసి "వెళ్ళొస్తాను అత్తయ్యగారూ" అన్నది. "మంచిదమ్మా ! ఎప్పుడు కనిపిస్తావో? నువ్వు కనిపిస్తే నాకు ప్రాణం లేచి వస్తుంది. ఇంకా ఎంత కాలం బతుకుతానమ్మా! ఈ జీవుడున్న నాలుగురోజులు అప్పుడప్పుడూ వచ్చి పోతుండమ్మా!" సుభద్రమ్మ ఆప్యాయంగా అన్నది. 'అలాగే అత్తయ్యగారూ!" సాగర్ కేసి ఓరగా చూస్తూ అన్నది. సాగర్ కు వొళ్ళు మండింది. అత్తయ్య గారూ......అత్తయ్యగారూ!.... ఏదో కావాలని నొక్కి నొక్కి అంటున్నది సుజాత. "పడవోయ్! ఏమిటాలోచిస్తున్నావ్? నన్ను వెళ్ళమంటావా? నువ్వొచ్చి పంపిస్తావా?" "వెళ్ళగలిగితే వెళ్ళు! మళ్ళీ నేనెందుకు నీకు తోడు?" "సాగర్? ఏమిట్రా నువ్వు, నీకంత కష్టమయితే చెప్పరా! మీ నాన్నగారే దించి వస్తారు." సాగర్ కంగారు పడ్డాడు. "పద సుజాతా!' సాగర్ సుజాత చెయ్యి పట్టుకుని తొందర పెట్టాడు. "వెళ్లొస్తాను అత్తయ్య గారూ!' సుజాత అతన్ని కొంటెగా చూస్తూ అన్నది. కలసి వెళుతున్న సుజాతను, సాగర్ ను చూసి మురిసి పోయింది సుభద్రమ్మ. గదిలో నుంచి బయటకు రాగానే "నువ్వెండుకోయ్ ఉడుక్కుంటావ్?" సుజాత అడిగింది. "మావయ్యగారి దగ్గర కూడా సెలవు తీసుకోవాల్సి వుందా/ లేక వస్తున్నావా?" గబగబా అడుగులు వేస్తూ అన్నాడు సాగర్. సుజాత సాగర్ ప్రక్కన కూర్చుంది. సాగర్ కారు స్టార్టు చేసి సర్రున తిప్పి రోడ్డెక్కాడు. ఆ కుదుపుకు సుజాత తూలి స్టీరింగ్ మీదకు పడింది. "నన్నివ్వాళ ఇంటికి చేర్చవా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *