మనసున మనసై 10

By | November 23, 2019
మనసున మనసై 10  'శ్రీధర్, ఓసారి ఇంట్రడ్యూస్ చెయ్యకూడదూ-అంత అందమైన అమ్మాయిని పరిచయం చేసుకునే అదృష్టానివ్వరాదు యీ మిత్రునికి'. నాకే పెద్ద పరిచయం లేదురా బాబూ ఎంగేజ్ మెంట్ నాడు చూశా, మళ్ళీ ఇవాళే చూస్తున్నాను. పద రాహుల్ గాడిని పట్టుకుందాం. 'నవ్వుకుంటూ ఇద్దరూ రాహుల్ దగ్గరకెళ్ళారు. భావిక నవ్వింది పలకరింపుగా ఇద్దరినీ చూసి-రాహుల్ చెవిలో గుసగుసలాడాడు శ్రీధర్ తెలుగులో. "ఏయ్ నా మీద ఏమిటి చెప్పుకుంటున్నారు. భావిక కినుక నటిస్తూ ఇంగ్లీషులో అంది. 'ఇంక నీ మీద చెప్పుకోవడానికి ఏం వుంది-నీ పక్కన అందాల భామ ఎవరిని అరా తీస్తున్నాడు దివాకర్' అన్నాడు రాహుల్ నవ్వి- భావిక నవ్వి చెల్లెలు చెయ్యి పట్టి లాగి 'మై సిస్టర్ మనీషా.....తెల్సుగా శ్రీధర్ ని రాహుల్ కజిన్, ఈయన దివాకర్ శ్రీధర్ చిన్నప్పటి ఫ్రెండు. హియీజ్ ఏ బ్యాంకర్...' అంటూ పరిచయం చేసింది. 'మా చెల్లెలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి 'బంజారా హిల్స్ లొ మంచి బ్యూటిక్ నడుపుతూంది' అంది. సుతారంగా నవ్వింది మనీషా, 'మావాడు బ్యాంకర్ నీకేడన్నా బిజినెస్ ఎక్స్ టెన్షన్ కి బ్యాంక్ లోన్లు కావలిస్తే చెప్పు ఇచ్చేస్తాడు' అన్నాడు శ్రీధర్ నవ్వి. అవకాశం పోగొట్టుకోకుండా 'ష్యూర్, ష్యూర్, ఇలాంటివారికి లోన్లిస్తే మా బ్యాంక్ పరపతి పెరుగుతుంది' అన్నాడు నవ్వి మనీషా 'థాంక్స్' అంది మరోసారి సుతారంగా నవ్వి ఈ లోగా ఇంకెవరో పెళ్ళికొడుకుని కూతురిని విష్ చేయడానికి రావడంతో అక్కడనించి కదలక తప్పలేదు. 'నైస్ టూ మీట్ యూ' అంటూ విష్ చేసి మనీషాని మరోసారి పలకరించి దివాకర్ కదిలాడు. డయాస్ నించి కిందకి రాగానే 'తీర్చిదిద్దిన శిల్పంలా వుంది. వంక వెతికి నా లేని అందం-షియీజ్ సూపర్బ్' అన్నాడు దివాకర్. 'అవును భావిక కంటే కూడా మనీషా బాగుంది. అంతేకాక ఆ అమ్మాయిది విశిష్టమైన వ్యక్తిత్వం-అమెరికాపై చదువులకి వెళ్ళమంటే అందరూ అమెరికాకు పోతే ఇండియా ఏమయిపోతుంది. నాకిక్కడే బాగుంది' అంటూ బిజినెస్ స్టార్ట్ చేసింది. తండ్రిది బట్టల వ్యాపారం కనక తను నేర్చుకున్న ఫాషన్ డిజైనింగులో కొత్త బ్యూటిక్ ఓపెన్ చేసింది....' 'ఐ లైక్ హెర్ ఏటిట్యూడ్' - దివాకర్ మెచ్చుకున్నాడు. ఏదో మైమరుపులో వున్నట్టు ఆమె వంకే చూస్తూ అన్నాడు. 'ఏయ్.... ఏమిట్రా ఎమోషనల్ అయిపోతున్నావు....మనీషాని చూడగానే మైకం కమ్మిందా' హాస్యం ఆడాడు. 'నిజమే.... కాని ఏం లాభం....వాళ్ళెక్కడ నేనెక్కడ....డబ్బులో మునిగితేలే వ్యాపార కుటుంబం....ఏదో బ్యాంకు ఉద్యోగం చేసే ఆఫ్టరాల్ గాడ్ని... నాకెక్కడ అందుతుంది' నిరాశ నటిస్తూ అన్నాడు. 'అదీ నిజమేలే-రాహుల్ అంటే అమెరికాలో వున్నాడు..... ఇద్దరూ ప్రేమించి చేసుకుంటున్నారు కనుక పెద్దవాళ్ళు అభ్యంతరాలు చెప్పలేదు తెలుగువాడైనా, ఇక్కడుండే మనీషాకి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *