మనసున మనసై 12

By | November 25, 2019
telugu stories మనసున మనసై 12  'ఓ, ఐలవ్ ఓల్డ్ సాంగ్స్. నాదగ్గర లత హేమంత్ కుమార్, రఫి అన్ని పాతపాటలు వున్నాయి. గజల్స్ అన్నీ కూడా యిష్టం.' 'ఐయామ్ హాపీ, మీకు సాహిత్యం, సంగీతం పట్ల మంచి అభిరుచి వున్నందుకు ఇంకో చిన్న ప్రశ్న. మీరు మీ అక్కలా అమెరికా వెళ్ళి సెటిలవడానికి యిష్టపడలేదని యిండియా వదిలి వెళ్ళడం యిష్టం లేదని అన్నారని విన్నాను. - ఐ కంగ్రాట్స్ యు ఫర్ ది నేషనల్ స్పిరిట్' 'దేశభక్తో మరోటో నీకు తెలియదు గాని, అంతా యిండియాను వదిలిపోతే దేశం ఏమవ్వాలి. అయినా యిప్పుడిక్కడ లేనిదేముంది అమెరికాలోకంటే. అఫ్ కోర్స్ బేసిక్ కంఫర్ట్స్ అంటే రోడ్లు, ఫోన్లు, నీరు, శానిటేషన్ వగైరాలలో మనం యింకా వెనకబడివున్నమాట నిజమే కాని వీటికోసం మాతృభూమిని వదిలి మన సుఖం మనం చూసుకోవడం అంటే నామనసెందుకో అంగీకరించడం లేదు. అన్ని కంట్రీలు తిరిగాను. చూడడానికి బాగున్నాయి- శలవులు ఎంజాయ్ చెయ్యొచ్చు కానీ వుండడానికి నీ మనసు అంగీకరించలేదు....' మనీషా చెప్తుంటే ముగ్ధుడై వింటున్నట్టుండి పోయాడు. 'రియల్లీ మిమ్మల్ని అభినందించి తీరాలి. ఇంత చిన్నవయసులో ఆకర్షణలకి లొంగకుండా మంచి వితరణ శీలిగా ఆలోచించగలగడాన్ని అభినందిస్తున్నాను. ఎంత చిత్రం మీ అభిప్రాయాలే నావీ అవడం, అమెరికా వెళ్ళి ఎం.బి.ఎ చెయ్యమన్నారు డాడీ. ఖర్చుకి కూడా వెనకాడకుండా పంపిస్తానన్నా వెళ్ళాలనిపించలేదు. మొన్న శ్రీధర్ కూడా అన్నాడు అమెరికా వచ్చేయ్. జాబ్ చూస్తానంటూ....కానీ, మీరన్నట్టు నా మాతృభూమి ముందు మిగతా దేశాలన్నీ దిగదుడుపే. అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి కోట్లు కూడా పెట్టొచ్చేమోగాని, యిక్కడుండే ఆత్మసంతృప్తి ఉండదనిపించింది. అయినా యిప్పుడిక్కడ ఎన్నో ఉద్యోగాలకు, ఎన్నో రకాల బిజినెస్ లకు అవకాశం వుంది. ఏంబిషన్, కాస్తంత చొరవ వుంటే బోలెడు వెంచర్లున్నాయి చేయడానికి' మనీషా అంగీకరిస్తున్నట్టు తల ఆడించింది. 'మనీషా బుటిక్' అన్నపేరు కింద 'పేషన్ డిజైనర్స్' అన్న బోర్డుంది. మనీషా బ్యాగునుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది. అద్దాల బీరువాలనిండా రకరకాల ఔట్ ఫిట్స్- బయట హాంగర్లకి వేలాడుతూ కొన్ని షోరూమునిండా అలంకరించివున్నాయి. ఆమె అభిరుచి తగిన ఫర్నిచర్, కౌంటరులో కంప్యూటర్, గోడలకి పెయింటింగ్స్, మంచి మోడల్స్ ధరించిన దుస్తుల ఫోటోలు మంచి లైటింగూ అరేజ్ మెంట్, వుండాల్సిన హంగులన్నీ వుండి ఆమె అభిరుచిని తెలుపుతుంది. షోరూం మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తుంది. షోరూము వెనక పక్కగదిలో నాలుగు కుట్టుమిషన్లున్నాయి ఆర్డర్లు తీసుకుని డ్రస్సులు తయారు చేయడానికి, మనీషా స్వయంగా డిజైనింగ్ చేస్తుంది. 'గుడ్, వెరీగుడ్... ఐ అప్రీషియేట్ యువర్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *