మనసున మనసై 4

By | November 21, 2019
మనసున మనసై 4  "మీ అక్క నన్ను చేసుకోవడం నాకు వరం అయిందనుకుంటున్నాను" తమాషాగా అన్నాడు. "ఎందుకు?" ఆశ్చర్యంగా చూసింది దమయంతి. "ఆమె చేసుకుంటానంటే నీవు దక్కేదానివి కాదుగదా. మా ఇద్దరి పెళ్ళి జరిగుంటే మేం ఇద్దరం సుఖంగా వుండేవాళ్ళం కాదు అనిపిస్తోంది. ఆమెకి సర్దుకుపోయే తత్వం కాదు. పెళ్ళికి కావాల్సిన ముఖ్యమైనది అదేకదా! ఏదో తంతే బూర్లగంపలో పడ్డాననిపిస్తోంది. నీ స్వభావం నాది కలుస్తుంది. మనం హాపీగా వుంటాం అనిపిస్తోంది" ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని అన్నాడు. "అప్పుడే, పెళ్ళయి ఇంకా ఒకరోజు కూడా కాకుండా నాగురించి తెలిసిపోయిందా' కొంటెగా అంది. "అన్నం అంతా పట్టుకుచూడాలా- ఈ పదిహేను రోజులలో మనం కలిసి తిరిగిన కొన్ని గంటలు చాలవంటావా మనిషిని అంచనా వేయడానికి- నా నమ్మకం వమ్ముకాకుండా చూసే పూచీనీది" భుజం చుట్టూ ఆప్యాయంగా చేయివేశాడు. "కావాలని చేసుకుని, కాపురం చెడగొట్టుకునే తెలివితక్కువతనం నాకు లేదు లెండి" నవ్వి అంది అభయం ఇస్తున్నట్లు. "మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అన్నది ఎంత నిజం. మీ అక్కని చూడటానికి వచ్చి నిన్ను చేసుకున్నాను చూడు-దమ్మూ వివాహంలో కావాల్సింది పరస్పర ప్రేమ, అనురాగాలు ఇచ్చి పుచ్చుకుని సర్దుకుపోయే మనస్తత్వాలు...అందం, ఆకర్షణ ఇవన్నీ నాలుగు రోజుల ముచ్చటే- "మనకు అందాలు లేవుకనక అలా సరిపెట్టుకుంటున్నామేమో ... అందని ద్రాక్ష....నవ్వుతూ కొంటెగా అంది. "ఇది అందిన ద్రాక్ష నాకు. ఈ పులుపులోనే తీపిని వెతుక్కుంటాను. ఈ మాత్రం సెన్సాఫ్ హ్యూమరుంటే చాలు జీవితం నిస్సారం అవదు. ఐ ప్రామిస్....ఏనాడు నా వైపునుంచి నిన్ను హర్ట్ చేసే ప్రవర్తన వుండకుండా జాగ్రత్తపడతాను" అన్నాడు ప్రేమగా కళ్ళలోకి చూసి- 'ఐ టూ.....' అతని గుండెలమీద వాలి అంది దమయంతి.                            * * * ఆ రోజు జయంతి ఆఫీసుకి వెళ్ళేసరికి కాస్త హడావిడి కనిపించింది. ఇంకా ఎవరూ పనిలొ ప్రవేశించలేదు. జయంతి నిరాసక్తంగా తన టేబిలు ముందు కూర్చుని లెడ్జరు బయటకి తీసింది. 'ఇవాళ బ్రాంచికి కొత్తమేనేజరు వస్తున్నాడు తెలుసా' అంది పక్క సీటు రేవతి. 'వస్తున్నాడా....'కాస్త ఆశ్చర్యంగా అంది జయంతి. ఆ బ్రాంచికి తను ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి లేడీ మేనేజర్. స్టాఫ్ లో ఎనభై శాతం మంది ఆడవాళ్ళే. అందుచేత మేనేజరుగా పురుషుడు రావడం ఆఫీసులో కాస్త డిస్కషన్ కి అవకాశం అయింది. 'అదేమిటి? ఇదివరకు ఇక్కడచేసి వెళ్ళిన సుజాత మేడం ప్రమోషన్ మీద వస్తుందనుకున్నాంగా' ఆవిడని విజయవాడ వెళ్ళమన్నారుట. దివాకర్గారిని ఇక్కడ వేశారు. 'దివాకర్ అంటే ఎవరు. పేరు విన్నట్టులేదు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *