ముద్ద మందారం 1

By | May 17, 2020
telugu stories kathalu novels ముద్ద మందారం 1 ఎన్ని సార్లు ఆమె వైపు చూసినా తనివి తిరట్లేదు ప్రసాద్‍కి. లోకాన్ని మరచిపోయి అలా ఆమెని చూస్తూ ఎంతో మథురానుభూతికి లోనౌతున్నాడు. ప్రొద్దున లేవడం మొదలు రాత్రి పడుకునే వరకూ వీలైనంతా మటుకు ఆమెను చూడటానికే విశ్వ ప్రయత్నం చేస్తాడు. అతడి చర్యకి ఆమె కూడా స్పందిస్తూ గాలిలో ఓర చూపుతో చిలిపి సందేశాలను, దొండపండులాంటి ఆ పెదాలతో తియ్యటి సందేశాలను చేర వేస్తూనే ఉంటుంది. దాదాపు నెల రోజులు నుంచి వారిద్దరి మధ్య ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రసాద్ ఆ రూంలోకి వచ్చి కూడా సరిగ్గా నెల రోజులవుతుంది. తన ఫ్రెండ్‍ రాము ఇక్కడ ఉంటున్నాడని తెలుసుకుని,తను కూడా ఉద్యోగం కోసం ఇక్కడికే వస్తున్నట్లు,నీ రూములోనే నేను కూడా ఉండటానికి కాస్త సహకరించాలని లెటర్‍ వ్రాసాడు ప్రసాద్ రాముకి. దానికి రాము సరే అనడంతో ఠంచనుగా వచ్చి రూంలోకి జాయిన్‍ అయిపోయాడు. ప్రసాద్‍ వచ్చి రాగానే రాము ఆఫీస్ పని పైన బాంబే వెళ్ళాల్సి రావడంతో ప్రసాద్‍కి తగిన జాగ్రత్తలు చెప్పి తాను నెలా, నెలపదిహేను రోజుల వరకూ రానని, అన్నింటికంటే ముఖ్యంగా తనకి ఈ కాలనీలో మంచి వాడనే పేరు ఉందని,ఆ పేరు నీ ద్వారా చెడిపోకుండా ఉండేలా ప్రవర్తించాలని వెళ్తూ వెళ్తూ చెప్పి మరీ వెళ్ళాడు. అందుకే ప్రసాద్‍ ఎదురింటి ఆ అమ్మాయి నెల రోజుల నుండి తనకి సైటు కొడుతున్నా కేవలం చూపులతో ఆమె అందాలని జుర్రుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు.కానీ,ధైర్యం చేసి ముందుకి కదలలేక

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *