పల్లెపడుచు 3

By | May 6, 2020
telugu stories kathalu novels పల్లెపడుచు 3 తన అందానికి ముగ్దురాలయిన ఒక అందమైన మగువ తనతో ప్రణయకార్యాన్ని సాగించడానికి ఇలా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళుతుంది... అనే భావన అతని మనసుని స్వప్నలోకాలవైపు పరుగెత్తిస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఈ పల్లెటూరి పడుచుతో తను పొందే సుఖాన్ని తలుచుకునే సరికి అతని శరీరంలో తీయటి పులకింత కలిగింది. వెచ్చటి కోరిక అతని మనసుకి తాకి అల్లరి చేస్తుంటే ఆమెతో గడపబోయే ఆ ఆనందక్షణాలని తొందరగా అందుకోవాలని ఆరాటపడుతూ ఆమె వెనకాలే అదుగులు వేస్తున్నాడు అజయ్... ఇప్పుడు మరొక్క మారు నక్క ఊళ వినిపించినా అతనికి భయం కలగలేదు. ఆ చీకట్లో చెట్లూ, పుట్టలూ దాటుకుంటూ అరగంట సేపు ప్రయాణించిన తర్వాత ఓ చోట సడన్ గా ఆగిపోయింది చామంతి... ఆమె వెనకాలే మెల్లిగా అడుగులు వేస్తున్న అజయ్ కూడా ఠక్కున ఆగిపోయాడు. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా నిలబడిపోయారు. తన ముందే ఉన్న చామంతి రూపం ఆ చీకట్లో కనిపించకపోయినా ఆమె వంటిపై నుండి వస్తున్న ఒక రకమైన సుగంథపరిమళం అతని ముక్కు పుటాలని తాకి మత్తెక్కిస్తోంది.... తనకి నాలుగాడుగుల దూరంలో ఉన్న చామంతిని అమాంతం వెనుక నుండి వెళ్ళి గట్టిగా కౌగిలించుకోవాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంటూ ... ఆమె నుండి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు అజయ్.... అయిదు నిముషాలు గడిచినా అలాగే నిశ్శబ్దంగా నిలబడి ఉన్న చామంతిని చూసి భరించలేకపోయాడు అజయ్.... అసలెందుకామె అలా మౌనంగా ఉందొ అర్థం కాలేదు అతనికి.... తనపై అంత వ్యామోహం పెంచుకున్న చామంతి అర్థరాత్రి వేళలో వచ్చి పడుకున్న తనని నిద్రలేపి ఇలా ఏకాంతమైన ప్రదేశానికి తీసుకువచ్చి, తీరా వచ్చాక ఇప్పుడిలా మౌనంగా ఉండిపోయి తనని టెన్షన్ కి గురిచేస్తుండటంతో కాస్తంత చిరాకేసింది అజయ్ కి. ఉన్న ఫళంగా వెళ్ళి ఆమెని గట్టిగా కౌగలించుకుని ఆమె ఆధారాలని తన అధ్రాలతో బంధించి స్వర్గలోకపు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *