వెన్నెల రాత్రి 4

By | November 27, 2019
telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 4 " మరి నేవెళతా" అంది అమె. అమె వెళ్ళబోయేందుకు అతనికి ఏదో ప్లాష్ అయినట్టు ముఖం వెలిగింది. " ఒక్కమాట" అన్నాడు. అమె ఆగి ఏంటయ్యా?" అని అడిగింది. "రేపు పది గంటలకి రోడ్డులో వుంటే మా మామిడితోటకు  ఓసారి వస్తావా? నీతో పనుంది" అన్నాడు. "నాతోనా?" అమె అశ్చర్యపోతూ అడిగింది. "అ" అన్నాడు సురేష్ వర్మ. అమె ఆలోచనలో పడింది. పని ఏమిటని అమె అడగలేదు. రేపు పదిగంటలకల్లా తెలిసిపోయే విషయానికి ఇప్పట్నుంచే ఎందుకు ఏదేదో వూహించుకోవడం?" అందుకే పనేమిటని రెట్టించకుండా "అట్లానే" అంది. "అరవయ్యేళ్ళ వయసుకదా ఈ మధ్య చూపు మందగిస్తోంది" అంటూ తిన్నె పట్టుకుని దిగింది. శశిరేఖ తిరిగి ఇంటికి వెళ్ళేవరకు అక్కడేవుండి ఆ తరువాత ఇంటికి చేరుకున్నాడు. మరుసటిరోజు ఉదయం ఠంచనుగా పదిగంటలకల్లా మామిడితోటకు వెళ్ళాడు. ఓ చెట్టుకింద రెండు కుర్చీలు వేయించాడు. చింతామణి కోసం వెయిట్ చేస్తూ ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. అయినా చదువుమీద దృష్టిపోవడంలేదు. అలా లేచి తోటంతా తిరిగి వచ్చేటప్పటికి చింతామణి కనపడింది. అమెను చూడగానే అతనికి గుండెంతా తెలియని భయం, జంకూ అవరించాయి. అమె అతన్ని చూడగానే లేచి నిలబడింది. "ఫరవాలేదు కూర్చో" అని తన కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. చింతామణి ఓపికగా వింటోంది తప్ప విషయం ఏమిటో అడగడం లేదు. చివరికి అతను తెగించాడు " నువ్వు నాకో సాయం చెయ్యాలి" అన్నాడు ఉపోద్గాతంగా. "సహాయమా? నీలాంటివారికి నేను చేసే సాయం ఏముంటుంది?" అమెకు అర్దం కాలేదు. "నువ్వు చేయాలి. నువ్వే చేయగలవు" అని ఓ క్షణం ఆగి " ఎప్పుడో బతుకుతెరువుకోసం చేసిన పనిని ఇప్పుడు నాకోసం చెయ్యాలి" అని చెప్పి అమె యాక్షన్ కోసం చూస్తుండిపోయాడు సురేష్ వర్మ. అమెకి కొద్దిగా అర్ధమౌతోంది. అయితే అతను బయటపడితేనే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *