వెన్నెల రాత్రి 5

By | November 28, 2019
telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 5 ఆయన ఆర్ అండ్ బిలో ఇంజనీర్. పాల వ్యాపారంలో లాభాలొస్తున్న కొద్దీ సంఘంలో తనపట్ల మారే ధృక్పథాన్ని అతను కనిపెట్టాడు. డబ్బు కూడేకొద్దీ పరపతి, గౌరవం, ఆదరాభిమానాలు పెరుగుతాయని గుర్తించాడు. వాటినన్నిట్నీ ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. గతంలో జరిగిన అవమానాలన్నీ మరుగున పడిపోతున్నాయి. డబ్బుకున్న పవర్ ఏమిటో తెలిసింది. పదిమందిలో అధిపతిగా వుంటే ఆ ఆధిక్యం ఇచ్చే మత్తు ఎంత గొప్పగా వుంటుందో తెలిసింది. ఇక పాల వ్యాపారం వదిలేసి అంచెలంచెలుగా అందరూ తన గురించే మాట్లాడుకునే స్థాయికి ఎదగాలని అనుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్న తరువాత శివరామారావు అభిమానం పొందడానికి ఏమేం చేయాలో అవన్నీ చేశాడు. ఆయన దృష్టిలో నరేంద్ర అంటే చాలా కష్టపడే మనిషి, నిజాయితీపరుడన్న పేరు సంపాదించాడు. ఆయనకి అలాంటి అభిప్రాయం కలిగించిన తర్వాత మెల్లగా ఓరోజు తనేం అనుకుంటున్నాడో చెప్పాడు. "పాలవ్యాపారం ఎంతకాలమని చేయడం, మీరేదైనా దారి చూపించాలి" అంటూ కాంట్రాక్టర్ కావాలనీ వుందన్న కోరికను వెలిబుచ్చాడు. ఆయన సరేనన్నాడు. నరేంద్ర అదృష్టంకొద్దీ అంతకుముందు రోడ్డుపని తీసుకున్న కాంట్రాక్టర్ గుండెపోటుతో చనిపోతే దాన్ని శివరామారావు నరేంద్రకు ఇప్పించాడు. అలా నరేంద్ర ఆర్ అండ్ బిలో కాంట్రాక్టర్ అయ్యాడు. జీవితం చూసిన మనిషి, దరిద్రాన్ని అనుభవించిన మనిషి కావడంతో ఎక్కడా పొరబాట్లు చేయలేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసు. అందులోనూ డబ్బు కూడబెట్టడంలో వుండే తీపి తెలుసుగనుక ఇక వెనక్కిచూసే అవసరం లేకుండాపోయింది. అంచెలంచెలుగా అనుకున్న రేంజ్ కి ఎదిగాడు. తమ పల్లెటూరికి దగ్గర్లో వున్న ఓ చిన్న టౌన్ కి ఫ్యామిలీ మార్చాడు. అక్కకి పెళ్ళిచేశాడు. ఇప్పట్లో తను పెళ్ళి చేసుకోకూడదనుకున్నాడు. కాంట్రాక్టర్ గా నెంబర్ వన్ పొజిషన్ లో వుండాలని రేయింబవళ్ళు కష్టపడ్డాడు. పదిమంది తనను చూసి మెచ్చుకోవాలన్నదే అతని ఏకైక ఆశయం, ఆనందం. అందుకు ఏమేం అవసరమవుతాయో అన్నీ చేసుకోవాలనుకున్నాడు. బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. జీప్ కొన్నాడు. ఆస్తులు సంపాదించాడు. కాంట్రాక్టులు ప్రారంభించిన ఆరేళ్లకే బంధువుల్లో నెంబర్ వన్ పొజిషన్ కి ఎదిగాడు. "మన దగ్గరి బంధువుల్లో నాకున్న ఆస్థి ఎవరికీ వుండకూడదు. అప్పుడే నా పెళ్ళి" అని తల్లితో అనేవాడు. ఇప్పుడు ఆస్థాయీ వచ్చింది కనుక తల్లి పెళ్ళి చేసుకొమ్మని పోరింది. సరేననుకుని అతనికోసం సంబంధాలని చూసే పెళ్ళిళ్ళ పేరయ్యని రమ్మన్నాడు. తన ఆశయం, ఆశ ఏమిటో చెప్పాడు- "నేనూ, నా భార్యా కలిసి అలా బజారంటపోతుంటే అబ్బ! నరేంద్ర ఎలాంటి భార్యను కొట్టేశాడ్రా! అని అందరూ ముక్కుమీద వేలేసుకోవాలి." అంటూ వివరించి- "అలాంటి అమ్మాయి కావాలి. డబ్బు లేకపోయినా ఫరవాలేదు. గతంలో నువ్వు నాకో అమ్మాయి ఫోటో చూపించావ్. అప్సరసలాగుంది. ఆమెకి పెళ్ళికాలేదేమో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *