అమ్మాయి ప్రేమ పరిణయం 12
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 12 రవళి ఆ మాటన్నాక యశ్వంత్ కి అనిపించింది "ఇంత పిచ్చి సాకు నేను తప్ప ఇంకెవరూ చెప్పరేమో..ఇప్పుడు ఇంక వేరే ఏదైనా సాకు చెప్పినా వాళ్ళకి అనుమానం రావచ్చు. ఎలా వీళ్ళని ఇప్పుడు వీడియో కాల్ వద్దని చెప్పి నమ్మించడం""అంటే అత్తా..తను, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూం లో కంబైండ్ స్టడీస్ చేస్తున్నారు. అది రిమోట్ ఏరియాలో ఉంది. అక్కడ నెట్ సిగ్నల్ సరిగ్గా ఉండదు. కావాలంటే మాములుగా ఫోన్ లో మాట్లాడొచ్చు కానీ నెట్ సిగ్నల్ దొరకదు" అన్నాడు యశ్వంత్. తను చెప్పింది నిజమైనా కాకపోయినా వాళ్ళు నమ్మితే చాలనుకున్నాడు.ఆ మాట వింటూనే రఘుపతి గారు నిట్టూర్చారు "సరేలే శార్వాణి చెప్పగానే ఏదో అమ్మాయిని ఒకసారి చూద్దామని అనిపించింది. కుదరదంటున్నావుగా పది రోజులు పోయాకే చూస్తానులే" అన్నారు నిరాశగా."ఫోన్ చేస్తాను తాతయ్య మాట్లాడండి""ఇప్పుడు వద్దులేరా రేపు మాట్లాడతా. ఇప్పుడు నాకు నిద్ర