మనసున మనసై 2 ‘హు- దానికసలు ప్రపంచ జ్ఞానం లేదు. లైఫంటే పుస్తకాలు, సినిమాలల్లోలా వుంటుందనుకుంటుంది. ఇలా వచ్చిన సంబంధం అలా తిప్పి కొడితే యింకెవరు అసలు రారు. అప్పుడే యిరవై ఎనిమిది వచ్చాయి. తనకు తోచదు చెపితే అర్ధం చేసుకోదు.’ వాసంతి ఆవేదనగా అంది. “పోనీ తనంతట తాను నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకోవచ్చుగా, అమ్మావాళ్ళేం వద్దనలేదుగా’ దమయంతి అంది. ‘అమ్మ, నాన్న యింక సంబంధాలు చూడడం మానేస్తే సరి అపుడు తెలిసొస్తుంది.’ ‘నాన్న యింకో రెండు మూడేళ్ళకి రిటైరవుతారు.… Read More »