ప్రేమాభిషేకం 8
naa telugu kathalu ప్రేమాభిషేకం 8 టిఫిన్ చేసి కావ్య ఇంటికి వెళ్తూ నా ఫ్రెండ్స్ మధు & ప్రవీణ్ కూడా తీసుకు వెళదాం అనుకున్నా, మళ్ళీ వాళ్ళు కూడా వస్తే తను ఏం జరిగింది చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అనుకుని ఒక్కడినే వెళ్ళా. కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ గారు చాలా ప్రేమగా పలకరించారు, ఇన్ని రోజులు కనీసం ఇంటికి ఎందుకు రాలేదు, కావ్య కి కూడా కాల్ చెయ్యడం మానేశావ్ అంట అని అడిగింది. అదేం లేదు ఆంటీ ఎగ్జామ్స్ కదా అన్నా, ఇంతలో ఆవిడ కావ్య అభి వచ్చాడు అని పై రూమ్ లో ఉన్న తనకి వినపడేలా చెప్పింది. కావ్య వాళ్ళ ఇల్లు డూప్లెస్ హౌస్ బాగా పెద్ద ఇల్లు కూడా పైన ఉండే 2 బెడ్ రూమ్ లో ఒక రూమ్ లో తను ఉంటుంది, అక్కడ తన చదువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని పైన రూంలోనే ఉంటుంది. కింద ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ ఆమ్మ పిలుపుతో మెట్లు దిగుతూ కిందకు వస్తున్న