అమ్మాయి ప్రేమ పరిణయం 53
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 53 ఇంక ఆయన ఎంత చెప్తున్నా తన మాట వినకపోవడంతో "సరే బాబాయి ఒప్పుకుంటాను కానీ దానికన్నా ముందు మీ ఆపరేషన్ జరగాలి. దాని తరువాతే మనం పెళ్ళి గురించి ఆలోచిద్దాం" అంది
"ముక్తా.." అని ఆయన ఏదో చెప్పబోవడంతో
"లేదు బాబాయి ఇంక మీరేం చెప్పొద్దు ముందు మీ ఆపరేషన్ జరిగాకే నా పెళ్ళి గురించిన విషయాలు మాట్లాడదాం లేదంటే చెప్పండి నేనసలు పెళ్లే చేసుకోను. నేను ఎంత మొండిదాన్నో మీకు తెలుసు ఆ తరువాత మీ ఇష్టం" అంది ముక్త
ఆయన ఇంకేం మాట్లాడలేక "సరే నీ ఇష్టం" అన్నారు
ఆ మాట చెప్పడం తో ముక్త వాళ్ళ పిన్ని ముక్త ని సంతోషంతో గట్టిగా హత్తుకుంది. "థ్యాంక్స్ రా" అంది చిన్నగా ముక్త చెవిలో తనకి మాత్రమే వినిపించేలాగ
ఆ తరువాత చీకటి పొడే దాక మాములు ఊరి విషయాలు, ముక్త ఆఫీస్ విషయాలు, హైదరాబాద్ విశేషాలు ఇవన్నీ చాలా సేపే మాట్లాడుకున్నారు. ఆ మరుసటి రోజే విజయవాడ ప్రయాణం అవ్వడంతో తొందరగా తినేసి పడుకున్నారు.
మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకే ఒక టాక్సీ మాట్లాడుకొని ముక్త వాళ్ళు విజయవాడ వెళ్ళారు. వాళ్ళు విజయవాడ వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం రెండు దాటింది. విజయవాడ బయలుదేరేముందే హాస్పటల్ కి ఫోన్ చేసి సాయంత్రం నాలుగు గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది ముక్త. డాక్టర్ ని కలవడానికి ఇంకా టైం ఉండడంతో హోటల్లో నే తినేసి హాస్పటల్ కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ ని కలిసి వాళ్ళ బాబాయి పరిస్థితి అంతా వివరంగా చెప్పింది ముక్త. ఆయన ముక్త చెప్పింది మొత్తం విన్నారు అంతకు ముందే ఒకసారి ఆయన్ని చూడడంతో ఆ రిపోర్ట్స్ అన్ని ఒకసారి చూసి మందుల విషయం లో చెయ్యాల్సిన మార్పుల గురించి చెప్పారు. ఇవి కొన్ని రోజులు వాడిన తరువాత అంతా బావుంటే ఆపరేషన్ చేస్తానని చెప్పడంతో ముక్త చాలా సంతోషపడింది. అప్పటికే పొద్దున్న అంతా ప్రయాణం చేసి ఉండడం తో హరిప్రసాద్(ముక్త బాబాయి) గారి పరిస్థితి గమనించి ఆ రోజుకి అక్కడే ఏదైనా హోటల్లో రూం తీసుకొని ఉందామనుకుంది ముక్త. ఆ విషయాన్నే వాళ్ళ బాబాయి కి చెప్పి టాక్సీ ని ఒక మంచి హోటల్ దగ్గర ఆపమన్నారు. హోటల్లో రూం తీసుకున్నాక అందరూ ఫ్రెష్