శృంగార నగరం 1

By | February 18, 2019
వర్షకి మెలకువ వచ్చింది.   పడక  మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి  గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్ లైట్ వెలుగుతోంది.   రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ గా ఫీలయింది.   పక్కకు తిరిగి చూస్తే టైమ్ పీస్  అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్నా తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది.   "అబ్బ! ఎంత బావుందో వాతావరణం" తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష.   బాత్రూమ్ లో ముఖం కడుక్కుని అద్దంలో చూసుకుంది. పాతికేళ్ళ పరువాన్ని ఆరోగ్యంతో రంగరించినట్లు మెరిసిపోతోంది శరీరం.   ఆమె పెద్ద  అందగత్తేమీ కాదు. కానీ ఏదో  తెలియని ఆకర్షణ చూపరులను ఇట్టే లాగేస్తుంది. వ్యక్తిత్వపు గుభాళింపువల్ల ఎక్స్ట్రా ఆకర్షణ అది.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *