శృంగార నగరం 23

By | February 20, 2019
లోపలికెళ్ళాను. అమ్మ గదిలోకి వచ్చి 'పెళ్ళివారొచ్చారు త్వరగా తయారవ్వు అంది. చీర మార్చుకుని వచ్చి కూర్చున్నాను. అలవాటైన ప్రశ్నలూ- అలవాటైన సమాధానాలు. అరగంటకు ఆ తంతు ముగిసింది. చిత్రంగా నాన్న కూడా వాళ్ళతోపాటే కారెక్కి వెళ్ళిపోయారు. మరో నాలుగు రోజులవరకు నాన్న జాడలేదు. అయిదోరోజు సాయంకాలానికి వచ్చాడు. చేతిలో వున్న పెద్ద ప్యాకెట్ టేబుల్ మీద పెట్టి స్నానాల గదిలోకి వెళ్ళాడు. అమ్మ నా దగ్గరకు వచ్చి "నీ పెళ్ళి శుభలేఖలు అవి వెళ్ళి చూసుకో టైమ్ ఎక్కువ లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే రేపే పోస్ట్ చేసెయ్" అంది. అంతా ముక్తసరిగా చెప్పి తన పనుల్లో మునిగిపోయింది. నేను ప్యాకెట్ విప్పాను నా నిరీక్షణ ఫలించినట్లు నవ్వుతున్నాయి శుభలేఖలు. మొదటి పెళ్ళిపత్రిక సుమతికి పంపాలి కాబట్టి అడ్రస్ రాయడానికి పెన్ కోసం వెదికాను ఎక్కడా కనిపించలేదు. హాల్లోని టేబుల్ మీద వుందేమోనని అటు వెళ్ళాను. అమ్మా వాళ్ళ గది తలుపులు మూసి వున్నాయి. అప్పుడే నిద్రపోయారేమిటి అనుకుంటూ వుండగా మెల్లగా మాటలు విన్పించాయి. తలుపులు మూసి అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి గది ముందు కెళ్ళి నిలబడ్డాను.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *