శృంగార నగరం 3

By | February 18, 2019
"నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు."   "నీ పేరు చాలా బావుంది."   "థాంక్స్" ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.   అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు.   ధాన్య వర్ష వివరాలు చెప్పి "ఈయనే మా నాన్న" అంటూ పరిచయం చేసింది.   వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది.   "నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది" అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు.   ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *