వీడియో కాల్ 44
telugu stories kathalu novels వీడియో కాల్ 44 అప్పుడు అనసూయ..., "చూడు..., మీ నాన్న బావా కలిసి చైనా వెళ్లే ప్రోగ్రాం వేశారు...., అక్కడ చవకగా స్టాక్ కొని ఇక్కడ మన దేశంలో అమ్ముతారంట. వాళ్ళు చాల బిజీగా ఉన్నారు..., కాబట్టి కొన్ని చూసి చూడనట్టు వదిలేయి..., నేనే వలిద్దరితో మాట్లాడి చూస్తా...., సరేనా???", అని నవ్వింది.
"థాంక్స్ అమ్మా...., నువ్వెంత మంచిదనివో..., నేనే ని పైన అనుమాన పడుతుంటాను ఊరికే..., అన్ని పిచ్చి ఆలోచనలు..., అవునమ్మా...., చైనాలో ఏ సిటీకి వెళ్తున్నారు నాన్న వాళ్ళు?", అని అమాయకంగా అడిగింది రమ్య.
"ఓహ్ ఆదా..., హ్మ్మ్..., ఏదో పేరుంది..., వుహాన్ అనుకుంటా...", అని చెప్పింది వాళ్ళమ్మ.
***
ఆ రోజు మధ్య రాత్రి అనసూయ చిన్న కూతురిని నిద్రా లేపి ఇంటి హాల్లోకి పిలిచింది.
నిద్ర మబ్బు కళ్ళు తుడుచుకుంటూ లైట్స్ అన్ని ఆన్ చేయ్యడం వల్ల వెలిగిపోతున్న హాల్లోకి ఎంటర్ అవుతూ...., "ఏంటమ్మా???", అంటూ గుణుగుతూ వచ్చింది రమ్య.
చూస్తే రమ్యకోసం బాగా షాపింగ్ చేసి సామాను తీసుకుని వచ్చాడు రామ్మోహన్.
అక్కడున్న షాప్పింగ్స్ బాగ్స్..., కొత్త బట్టలు..., చెప్పులు..., మెక్ అప్ ఐటమ్స్...., అల తనకి ఇష్టమైన సామాను చూసి సంతోషపడుతూ అనుమానంగా...., "ఏంటి ఇవ్వన్నీ???", అని అడిగింది రమ్య.
అనసూయ నవ్వుతు..., "ఏవండీ..., మిరే