అమ్మాయి ప్రేమ పరిణయం 13

By | February 11, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 13 ఆ రోజు ఆదివారం...ఉదయం పది గంటలుచరిత ఫోన్ అప్పటికే రెండు సార్లు రింగ్ అయ్యి కట్ అయ్యింది. ఆ శబ్దానికి ముక్త నిద్రలోనే అటూ ఇటూ కదిలింది. ఎవరూ ఫోన్ ఎత్తకపోయేసరికి అది మళ్ళీ మూడో సారి రింగ్ అయ్యింది."అబ్బా ఎవరిది ఇంతగా విసిగిస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోతే కొంచం సేపు ఆగి కాల్ చెయ్యొచ్చు కదా వెంట వెంటనే ఈ టార్చర్ ఏంటి. అయినా అసలు ఫోన్ ఇక్కడే వదిలేసి ఈ చరిత ఎక్కడికి వెళ్ళింది" అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి"హలో" అంది విసుగ్గా ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా"ఆ విసుగేంటి పొద్దు పొద్దున్నే" అన్నాడు సంజయ్"నువ్వా ఏంటి నీకంత కంగారు ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోతే కొంతసేపు ఆగిన తరువాత ఫోన్ చెయ్యమని అర్ధం. అంతే గానీ ఊరికే ఫోన్ చేసి విసగించమని కాదు. అయినా పొద్దు పొద్దున్నే అదే పనిగా ఏంటీ గోల""ఏంటి పొద్దు పొద్దున్నా...ఉదయం ఆరు గంటలకి ఫోన్ చేస్తే పొద్దు పొద్దున్న అంటారు అంతేగానీ పదింటికి ఫోన్ చేసినా పొద్దున్న అని ఎవరూ అనరు. పది అవుతున్నా లేవలేదా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *