అమ్మాయి ప్రేమ పరిణయం 14
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 14 "ఒక మంచి ఫోన్ చూపించండి. స్క్రీన్ పెద్దదిగా ఉండాలి, క్లారిటీ బావుండాలి, ఫీచర్స్ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. ఫోన్ మరీ డెలికేట్ గా ఉండకూడదు అలా అని హెవీ వైట్ ఉండకూడదు. పెద్దవాళ్ళు వాడడానికి అనుకూలంగా ఉండాలి" అన్నాడు వచ్చినతనుఅప్పటిదాకా అతను మాట్లాడుతున్న ఫోన్ ని అక్కడ టేబుల్ మీద పెట్టి.అతని గొంతు తెలిసిన గొంతులా ఉండేసరికి ఎవరా అని పక్కకి తిరిగి చూసింది ముక్త. అక్కడ యశ్వంత్ కనిపించాడు."వీడా..వీడేంటి ఇక్కడ. ఇంకెక్కడ షాపులు దొరకనట్టు ఇక్కడికే రావాలా ఫోన్ కొనడానికి." అనుకుంది ముక్త."ఇంకా ఎంతసేపు చూస్తావు. అసలు నువ్వు ఇవాళ ఫోన్ కొంటావా లేదా" అని చరిత గట్టిగా అడిగేసరికి ఆమె ఆలోచనలనుండి బయటపడింది."నాకు కావాల్సిన ఫోన్ దొరికింది. చూడు ఎలా ఉంది" అంటూ అక్కడ టేబుల్ మీద పెట్టిన తన హాండ్ బ్యాగ్ ని విసురుగా లాగి భుజానికి వేసుకొని చరిత దగ్గరికి నడవబోయింది. ఈ లోపు ఆమె పక్కన ఏదో పగిలిన శబ్దం వినిపిస్తే ఏంటా అని చూసింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసిన విసురుకి ఆ బ్యాగ్