అమ్మాయి ప్రేమ పరిణయం 15
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 15 "ఇందాక నువ్వు విరగొట్టిన ఫోన్ చూసావుగా అలాంటిదే కావాలి నాకు. కొంచం కూడా తేడా రాకూడదు. సేం కలర్ సేం ఫీచర్స్ ఉండాలి. ఆ ఫోన్ని వెతికి కొని తీసుకొచ్చి నాకివ్వు. అంతకన్నా బెస్ట్ మోడల్ కొనిస్తానన్నా నాకేం పర్వాలేదు. నేనిక్కడే కూర్చుంటాను"ముక్త చరిత ని లాక్కుపోయింది. "రా" అని"ఎలా కొంటావు ఇప్పుడు అన్ని వేల ఫోన్. నీ ధైర్యం ఏంటో నాకర్ధం కావట్లేదు""చెప్తా రా""ఇక్కడున్న ఫోన్స్ అన్నింటిలో కాస్ట్లీ ఫోన్ సెలెక్ట్ చెయ్యి"చరిత ముక్త ని చూసింది."నన్నేం చూస్తావు ముంది సెలెక్ట్ చెయ్యి" అంది.చరిత అన్నీ ఫోన్స్ వెతికి అందులో అన్నిటికన్నా కాస్ట్లీ ఫోన్ సెలెక్ట్ చేసింది. "ఇది చూడు ఎలా ఉంది""బావుంది కానీ ఇదెంతుంటుంది""దాదాపు లక్ష""బాబోయి అంత కాస్ట్లీ ఫోన్స్ కూడా ఉన్నాయా""ఉన్నాయిలే ఇదే ఇక్కడ అన్నిటికన్నా