అమ్మాయి ప్రేమ పరిణయం 2
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 2 ముక్త ఆ ఆఫీస్ ని చూడగానే ఆశ్చర్యపోయింది. అది ఆరంతస్తుల భవనం. దాదాపు అయిదెకరాల్లో కట్టారనుకుంటా చాలా విశాలంగా ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్, బేస్ మెంట్ పార్కింగ్ కి వదిలేశారు. ఆ పైన ఫ్లోర్ లో కాంటీన్ ఉంది. దాని తరువాత నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. మొదటి ఫ్లోర్ అంతా రేడియో, న్యూస్ పేపర్స్, మ్యాగ్జింస్ కి యాడ్స్ డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్లోర్ లో దాదాపు యాభయి మంది దాకా స్టాఫ్ పని చేస్తారు. రెండో ఫ్లోర్ అంతా టెలివిజన్ కి, వెబ్ సైట్స్ కి యాడ్స్ డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు. యాడ్సే కాకుండా క్లైంట్స్ అడిగితే వాళ్ళకి వెబ్ సైట్స్ ని డెసైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా నలభయి మంది దాకా పని చేస్తారు. ఆ పై అంతస్తులో క్లైంట్స్ కి యాడ్స్ ని తీయడానికి వీలుగా ఒక ఇండోర్ యూనిట్ ఉంది. దాన్ని ఏవైనా యాడ్స్ తీయాల్సివచ్చినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ పై అంతస్తులో అడ్మినిస్ట్రేషన్ భాగం అంతా ఉంది. అక్కడే అకౌంట్స్ కి సంబంధించిన డిటైల్స్, క్లైంట్స్ కి సంబంధించిన ఇంఫర్మేషన్, కాపీ రైట్స్ కి సంబందించిన విషయాలు, ప్రొడక్షన్ మానేజ్మెంట్ అన్ని ఉన్నాయి. ఆ రోజు