అమ్మాయి ప్రేమ పరిణయం 24

By | February 24, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 24 "సర్" అంటూ రెండు సార్లు రాఘవరావు గారు పిలిచినా యశ్వంత్ పలకలేదు. యశ్వంత్ తీరు గమనించిన సంజయ్ కి అతని ప్రవర్తన చిత్రంగా అనిపించింది. ఎదురుగా రాఘవరావు గారు అయోమయం గా చూస్తుండేసరికి సంజయ్ కొంచం గట్టిగా పిలిచాడు "సర్" అంటూ అప్పుడు ఆలోచనల నుండి బయట పడ్డాడు యశ్వంత్ "సారీ చెప్పండి" అన్నాడు తనని తాను సర్దుకుంటూ. "సర్ స్టిల్స్ అన్నీ ఒకేనా. మనం ప్రొసీడ్ అయిపోవచ్చా." అడిగాడు సంజయ్ "ఒకసారి మళ్ళీ రిపీట్ చెయ్యండి రాఘవరావు గారు. ఫైనల్ డెసిషన్ తీసుకొనే ముందు ఇంకోకసారి చూస్తే మంచిది కదా" అన్నాడు యశ్వంత్. ఇందాక తను ముక్త మీదే ఎక్కువగా దృష్టి నిలపడంతో బ్యాక్ డ్రాప్ మీద గానీ, ఆమె వేసుకున్న నగల మీద గానీ ఫోకస్ చెయ్యలేకపోయాడు. అందుకే వెంటనే డెసిషన్ తీసుకోలేకపోయాడు. ఆ మాటకి సంజయ్, రాఘవ రావు గారు ఆశ్చర్యపోయారు. యశ్వంత్ నుండి ఏదైనా సరే మళ్ళీ చేద్దాం అని వినిడం ఇదే మొదటి సారి. అతను ఏది చేసినా పూర్తి ఏకాగ్రతతో చేస్తాడు. ఒకే పనిని రెండు సార్లు చెయ్యడం, ఒక్క సారి తీసుకున్న డెసిషంస్ మీద మళ్ళీ మళ్ళీ డిస్కషంస్ పెట్టడం అతని పద్దతికి వ్యతిరేకం. అలాంటి పనులు అతను ఇష్టపడడు. అలాంటిది ఇప్పుడు ఇలా అనేసరికి వాళ్ళిద్దరికీ నమ్మశక్యం కాలేదు. కానీ అడిగింది యశ్వంత్ కాబట్టి ఇంకేం మాట్లాడలేక మళ్ళీ ప్రొజెక్టర్ ఆన్ చేసారు. ప్రజక్టర్ మీద ఒక్కొక్క స్టిల్ చూస్తుంటే మళ్ళీ అతని మనసు అతని మాట వినట్లేదు. చాలా కష్టం మీద మనసుని అదుపులో పెట్టుకొని స్టిల్స్ చూస్తున్నాడు. అన్నీ అయిపోయాక మకరంద్ ని పిలిచి కొన్ని స్టిల్స్ సెలెక్ట్ చేసి చూపిస్తూ "ఈ కాస్ట్యూంస్ ధరించినప్పుడు పార్టీకి తీసుకున్న ఆ బ్యాక్ డ్రాప్ లో వాడిన కొన్ని లైటింగ్స్, కలర్స్ మ్యాచ్ అవ్వట్లేదు. వాటిని మార్చమని చెప్పాడు. ఇంకొన్ని కాస్ట్యూంస్ ని కొన్ని చోట్ల నగల మార్పులు ఉన్నాయి..అంటూ కొన్ని మార్పులు చెప్పాడు." అతను చెప్పినవన్నీ మకరంద్ నోట్ చేసుకున్నాడు. "జాగ్రత్త రేపు ఆకాంక్ష మార్నింగ్ టెన్ వరకూ వస్తుంది. మీకు తన గురించి తెలుసు కదా. కొంచం జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకూ రేపే షూట్ జరిగిపోవాలి. ఏదైనా అవసరం ఉంటే సంజయ్ తో మాట్లాడండి" అని చెప్పాడు "ఒకే సర్" అన్నాడు మకరంద్ "సంజయ్ ఈజిట్ ఒకే ఫర్ యూ" అడిగాడు యశ్వంత్ "యస్ సర్ నో ప్రాబ్లం ఐ కెన్ హ్యాండిల్ ఇట్" అన్నాడు సంజయ్ మకరంద్ తో మాట్లాడి అతన్ని పంపించేసాడు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *