అమ్మాయి ప్రేమ పరిణయం 36

By | March 9, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 36 "ఎప్పుడు ఎలా మాట్లాడతారో మీకే తెలీదు కదా సర్.. మొన్న ఇష్టమొచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయారు గా ఇప్పుడు గుడ్మార్నింగ్ చెప్తే ఇంకెంత తిడతారో అని చెప్పలేదు" సూటిగా వచ్చింది సమాధానం. మొన్న ఆ రోజు అతను కారణం లేకుండా ఇష్టమొచ్చినట్టు తిట్టినప్పటి నుండి ఆమె అతని మీద కోపంగానే ఉంది. అతని ఇష్టమొచ్చినట్టు తిట్టేసి కనీసం సారీ కూడా చెప్పలేదని ఇంకా కోపం. కానీ బాస్ కాబట్టి ఏం అనలేకపోయింది. అంతే కాకుండా ఆ తరువాత నుండి అతను మళ్ళీ ఆమెకి కనపడలేదు. ఆఫీస్ కి వచ్చాడో లేదో కూడా ఆమెకి తెలీదు. ఇప్పుడు కూడా అలా మాట్లాడగలదని ఆమె అనుకోలేదు కానీ అతను ఆ రోజు అలా తిట్టాడన్న ఉక్రోషం, ఇప్పుడు ఇంతసేపు ఇలా నిల్చోబెట్టాడన్న కోపం తో ఆ మాటలు ఆమె నోటి నుండి బయటకి వచ్చాయి. "ఓ అయితే ఆ రోజు నేను హోటల్లో నిన్ను తిట్టానని కోపం అన్నమాట" అన్నాడు "మీరు బాస్ కదా...మీరు తిట్టొచ్చు..." అంది వ్యంగ్యంగా "ఎవరికీ" అన్నాడు సూటిగా ఆ మాట ఆమెకి అర్ధం కాక అతని వైపు చూసింది. "ఎవరికి బాస్ ని అని అడుగుతున్నా" "మాకే" అంది అతనేం అడుగుతున్నాడో అర్ధం కాక "మాకే అంటే అందులో నువ్వు కూడా ఉన్నావా" "ఆ" అంది అయోమయంగా "ఓ ఉన్నావా...అంటే నేను మీ బాస్ నే అన్న విషయం నీకు గుర్తుందన్నమాట...సంజయ్ తో మీ బాస్..మీ బాస్ అని అంటుంటే మే బీ నేను నీకు బాస్ ని కాదేమో సంజయ్ కి మాత్రమే బాసేమో అనుకున్నాలే" అన్నాడు అతని సీట్ నుండి లేచి ఆమె దగ్గరికి వస్తూ. "ఆ తిట్టాలనుకున్నదేదో ఒకేసారి తిట్టేయచ్చుగా ఇలా పార్ట్లు పార్ట్లుగా తిట్టకపోతే" అని గొణుక్కుంది. "ఏంటి ఏదో అంటున్నావు" "ఏం లేదు సర్" అతను ఆమె దగ్గరికొచ్చి ఎదురుకుండా ఉన్న అతని డెస్క్ కి ఆనుకుంటూ "అది సరే సంజయ్ క్యాబిన్ లో ఏంటి పని" అన్నాడు "ఇతనికేమన్నా పిచ్చా ఇలా అడుగుతాడేంటి" అనుకుంటూ "డాక్యుమెంటేషన్ లో డౌట్ ఉంటే అడుగుతున్నా సర్" అంది నుదిటి మీద పడిన జుట్టుని వెనక్కి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *