అందమైన మాయ 40

By | July 28, 2020
telugu sex stories అందమైన మాయ 40 పడుకునే ముందు పక్క సర్దుతుంటే దిండు కిందనుంచీ సునయన కార్డ్ బయట పడింది. కార్డ్ చేతిలోకి తీసుకొని కాసేపు దాన్ని వేళ్ళమీద విచిత్రంగా తిప్పి చేతిని ముందుకు జాపాడు. కార్డ్ చేతిలో లేకుండా మాయమైంది. మళ్ళీ చేతిని విదిలిస్తే అది వాడి అరచేతిలోకొచ్చి పడింది. ఇప్పటిదాకా ఎవ్వరికీ, కనీసం శైలుకి కూడా చూపించలేదు వాడు ఈ ట్రిక్. మిమ్మల్ని ఏ వూళ్ళో చూడొచ్చు అని తనడిగితే ‘నా పాత జీవితం వదిలేసి నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తాను’ అని సునయన తనకి చెవిలో చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఎవరో దూరంగా పెద్ద గంట మోగించినట్లు గుండె ఝల్లనేది. ఇప్పుడు ఆ ఝల్లింత intensity తగ్గుతోంది. కారణం కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. శైలు గుర్తొస్తే ఇంక మనసులో వేరే ఆలోచనకి చోటు లేకుండా ప్రళయంలా కమ్మేస్తుంది వాడిని. ఇప్పుడు సునయన ఎదురుగా వస్తే ఏం చేస్తానో అనుకున్నాడు. కిరీటి కూడా అందరిలాంటి కుర్రాడే. ఈ వయసులో బరువైన ఆలోచనలు నిజానికి రాకూడదు. అయితే తన ప్రాణమిత్రుల్లో ఒకరు దూరమవడం, ఇప్పుడు శైలుతో ప్రణయం ఇవన్నీ వాడికి జీవితంలో ఫన్ ఒక్కటే కాదు బాధ్యతలు కూడా వుంటాయి అని చాలా త్వరగా తెలియచెప్పాయి. శైలుకి, తనకి ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు వుంటే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిద్ర పోయాడు. ఆ రోజు వాడికి పంచలోహ విగ్రహం

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *