ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 1

By | August 30, 2020
ఇన్సిస్టు-సొషియో-ఫాంటసీ 1 1. నాంది అవి దివిసీమకి ఉప్పెన వచ్చి ఊళ్ళకి ఊళ్ళని సర్వనాశనం చేసి వెళ్ళిన రోజులు. పెద్దాయన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామరావు గారు నడుముకి బట్టబిగించి సినిమా రంగం మొత్తాన్ని కదిల్చి విరాళాలు పోగుచేస్తున్న రోజులు. రాత్రి సమయం 1155 నిముషాలు. బయట జోరుగా వర్షం పడుతోంది. ఎదో వాగుపొంగడంతో నెల్లూరుకి పదనాలుగు కిలోమీటర్ల దూరంలోనే పట్టాలపైనే ఆగిపోయిన సర్కార్ ఎక్స్ ప్రెస్. అందులో ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంటు లోని ఒక కూపేలో పురిటినెప్పులు పడుతూ ఉన్న ఒక 25 ఏళ్ళ మగువ. ఆత్రుతతో కూపే బయట అటూ ఇటూ తిరుగుతున్న ఆమె భర్త. నిండు గర్భిణీని రైలు ప్రయాణం కట్టాడు చూడండి అంటూ తిట్టుకుంటున్న తోటి ప్రయాణీకులు. వాళ్ళల్లో పురుడుపుణ్యాలు చెయ్యగలిగిన ఇద్దరు పెద్ద వయసు స్త్రీలు మేము చూసుకుంటాం బాబూ అని ఆ భర్తకి ధైర్యం చెప్పి ఆ గర్భిణీ స్త్రీకి పురుడు పోయసాగారు. పక్క కూపేలో ఇవేవీ పట్టనట్టు పంచాంగం చూసుకుంటూ వేళ్ళు మడిచి లెక్కలు కట్టి పుస్తకంలో జాతక చక్రాన్ని వ్రాస్తున్న ఒక మహా పండితుడు.. ఏంటీ కట్టె కొట్టె తెచ్చె లాగా ఉందా. ఉండదు మరీ.. నేను భూమి మీదకు రాబోతున్నానాయే. మహానుభావులు ఊరకరారు అన్న నానుడి నిజం చెయ్యలిగా.. ఈ మాత్రం వైపరీత్యాలు లేకపోతే నా గొప్పతనం మా అమ్మానాన్న కి తెలిసేది ఎలా. ఇంతలో వ్రాసుకుంటున్న మహాపండితుడు పుస్తకంలొ వ్రాయటం ఆపి బయటకు వచ్చి పుట్టబొయే మీ బిడ్డ మహర్జాతకుడు అవుతాడు. గజకేసరి యోగముతో జన్మించబొతున్నాడు. తను ఏమి తలపెట్టినా ఆ రంగంలో గొప్పవాడు అవుతాడు కానీ....... అని ఒక్కసారి ఊపిరి బిగపెట్టెసరికి... ఎందుకు ఆపాడా అని నాన్న, నాన్నని తిట్టుకుంటున్న తోటి ప్రయణీకులతోబాటు, నాకూ టెన్షనొచ్చి ఇట్లాకాదంచెప్పేసేసి బుడుంగున బయటకొచ్చేసా.. అప్పుడే ఎవరో పన్నెండయ్యింది..హ్యాపీ న్యు ఇయర్.. నూతన సంవత్సర శుభాకంక్షలు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *