కథ విందువా? ఓ కథ విందువా?
telugu sex stories xossipi కథ విందువా? ఓ కథ విందువా? “మీకో మాంఛి సరసకథ కావాలి! అంతేగా!" బెడ్ మీద అటునుంచి ఇటు తిరిగింది సామీప్య.
"నేను కోరింది చెప్పాలి. అదీ షరతు! అలాగైతే మనకి ప్రతి రాత్రీ ఒక వసంత రాత్రి అవుతుంది." ఆమె పెదవులపై కొనగోటితో మీటాడు ప్రణీత్.
నరాలు జివ్వుమన్నాయి సామీప్యకు.
"ఇంతకీ దొరగారికి ఎటువంటి కథలు కావాలో సెలవిస్తే…!" భర్త ముఖాన్ని తనవైపుకు తిప్పుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ముద్దాడింది.
"చెప్పాలా? ఐతే ఇలారా! ఇంకా దగ్గరగా.. ఇంకా.. ఇంకా..." అని కౌగిలిలోకి తీసుకుని చెవిలో గుసగుసలాడాడు. "చీ! పొండి." అని అతన్ని వెనక్కి తోసేసింది సామీప్య.
"ఏమైంది" ఇబ్బందిగా అడిగాడు ప్రణీత్.
"నో... నాకసలు అటువంటివి గిట్టవు" అని మరోవైపు తిరిగిపోయిందామె.
"ఏం.... తప్పా? నాకటువంటివే ఇష్టం!"
"కాని, చెప్పడానికి నాకు కష్టమే! అయినా
అడిగినందుకు మీకు బుద్ధి చెప్పాల్సిందే." అని కసిగా అతన్ని గిల్లింది సామీప్య. అబ్బా అన్నాడు ప్రణీత్.
"అడిగింది చెప్పడానికి ఏమైంది, చెప్పు?" అన్నాడు అంతలోనే.
"మీరడిగింది ఏమైనా బాగుందా? మీరే ఆలో చించండి." ఇబ్బందిగా ముఖంపెట్టింది సామీప్య.
"ఇదిగో నాకు తెలియదు అనుకోకు. మీలో మీకు బోలెడు కబుర్లూ, కథలూ ఉంటాయి. అవే చెప్పమంటున్నాను, తప్పా?"
మృదువుగా అడిగాడు ప్రణీత్,
"వద్దండీ, ప్లీజ్!" అంటూ అతన్ని బుజ్జగించ డానికి కౌగిలిలోకి తీసుకునే ప్రయత్నం చేసింది. అతను కొంచెం దూరంగా జరిగాడు. వ్యర్థమైంది ఆమె ప్రయత్నం.
"అడిగింది చెప్పాల్సిందే. లేదంటే చూడు” అంటూ చటుక్కున పక్క మీంచి లేచి నేలమీద పడుకున్నాడు ప్రణీత్.
"మీరెందుకండి ఆ నేలమీద. నేను పడుకుంటాను. మీరు హాయిగా పక్కమీద పడుకోండి" తనూ కిందికి దిగి, భర్త గుండెలపై వాలింది సామీప్య.
ఆమెను వెనక్కి తోసేసాడు ప్రణీత్. కుమిలి పోయింది సామీప్య. తలలో మల్లెలు. పక్కమీద సన్నజాజులు... గుమ్మెత్తించే అత్తరు పరిమళం... అన్నీ