మనసున మనసై 15

By | November 28, 2019
telugu stories kathalu novels books మనసున మనసై 15  'అబ్బే ఎలామర్చిపోతాను. అందుకే నేనే ఇంటికొస్తానన్నాను' 'మా డాడి, మిమ్మల్ని ఏం అనుకుంటారో- 'పోనీ, ఆఫీసునించి ఇంటికెళ్ళేటపుడు బుటిక్ కి రానా' అలా మనీషాని మొహమాటంలో పెట్టి ఓ రోజు బుటికి వెళ్ళేవాడు. మరో రోజు మరో వంక...మీ బ్రాంచి ఓపెన్ విషయం ఏం చేశారు. ఆ ప్రాజెక్ట్ పేపరు రెడీ అవలేదు...' అని మరోసారి మాటల్లో దింపేశాడు. ఇంకో రోజు వూర్నించి వచ్చిన చెల్లెలుని వెంట బెట్టుకుని 'బుటిక్స్ లో చాలా ఖరీదుంటాయి అన్నయ్యా' అని అన్నా వినకుండా ఓ మంచి సల్వార్ కుర్తా సెట్ కొనడానికి తీసికెళ్ళాడు. మనీషాకి చెల్లెలిని వైజాగ్ లో గీతంలొ కంప్యూటర్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుందని పరిచయం చేశాడు. మనీషా నిజంగానే శిరీషని చూసి సంతోషించింది. 'అబ్బ మీరంతా ఐమీన్ మీ సౌత్ ఇండియన్స్ అంతా భలే పెద్ద పెద్ద చదువులు ఎలా చదువుతారు బాబూ, ఇంజనీరింగ్ అంటే లెక్కలు బాగా రావాలి కదూ. నాకు ఆ లెక్కలంటేనే భయం. మీరంతా మగాళ్ళతో సమానంగా బాగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. మీతో కంపేర్ చేస్తే చదువుల్లో, ఉద్యోగాల్లో మేం వెనకబడి వున్నాం. మాకు బి.ఏ లేదా బి.కాం వుంటే చాలని ఆపేస్తాం. చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలనుకునేవాళ్ళు చాలా తక్కువ..... 'దానికి కారణం చెప్పనా-ముందు నించి మీ ఇంట్లో మీరు పెరిగిన వాతావరణం....మీరంతా లక్ష్మీపుత్రులు... మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా వుంటుంది. మీ బిజినెస్ కమ్యూనిటీకి చదువు కేవలం విజ్ఞానం కోసం, డిగ్రీ కేవలం అలంకారానికి తప్ప ధనార్జనకి కాదు. చిన్నప్పటి నించి చదువున్నా లేకపోయినా డబ్బు ఆర్జించగలం అన్న భరోసా మీకుంది. మాకు అలా కాదు-మేము అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం-మాకు చదువుకుని ఉద్యోగం చెయ్యనిదే రోజు గడవదని తెలుసు-చిన్నప్పటి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల చదువుల మీద ప్రత్యేక శ్రద్ద చూపించి బాగా చదువుకోకపోతే మంచి ఉద్యోగాలు రావు అడుక్కుతినాలి అని నూరిపోస్తారు. వాళ్ళివ్వగలిగిన ఆస్తి పిల్లలకి చదువు చెప్పించడమే అనుకుని చిన్నప్పటి నుంచి మంచి స్కూళ్ళలో చదివించి అహోరాత్రులు వాళ్ళతోపాటు కష్టపడి వాళ్ళని డాక్టర్లు, ఇంజనీర్లు, ఐ ఎ ఎస్ లు, చెయ్యడానికి తాపత్రయపడ్తారు. అంచేత కాస్త జ్ఞానం వచ్చాక పిల్లలూ అర్ధం చేసుకుంటారు కష్టపడి చదవాలని. ఇదివరకయితే మగపిల్లలనే బాగా చదివించి ఆడపిల్లలని ఏ మెట్రిక్కో మహా అయితే డిగ్రీ చదివించి మంచి ఉద్యోగం వుండే అల్లుడిని చూసేవారు. ఇప్పుడు ఆడ, మగ ఇద్దరూ పెద్ద చదువులు చదువుతున్నారు. మనీషాజీ, మీరు చూడండి ఇలా బుటిక్ పెట్టి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. మా ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని తన కాళ్ళ మీద నిలబడాలని ప్రతి ఆడపిల్లా ఆశిస్తూంది, బిజినెస్ అన్నది మా రక్తంలొ లేదు గనక మీలా డబ్బు సంపాదించాలన్న ఆలోచనే రాదు మాకు.....' బాబోయ్ ఎంత ఉపన్యాసం ఇచ్చారు' అంది మనీషా నవ్వి. 'అన్నయ్య చెప్పిందంతా నిజమే. మాకెవరికీ చదువురాకపోయినా ఇలా ఏదో చేసి బతకొచ్చనే ఆలోచన రాదు....' శిరీష నవ్వుతూ అంది. 'ఎలా వస్తుంది. మనీషా డాడీకి డబ్బుంది కాబట్టి పెట్టుబడి పెట్టి ఆయన బుటిక్ ఓపెన్ చేయించేశారు. మన దగ్గర ఏముంటుంది. కిరాణాకొట్టు పెట్టాలన్నా మదుపు కావాలి, పెట్టగానే సరా! మెళకువలు తెలియాలిగా." ఓ గంట కూర్చుని చెల్లెలికి మనీషా చేతే డ్రెస్సు సెలెక్ట్ చేయించి వెళ్ళాడు. మర్నాడు మీ చేతి డిజైను డ్రస్సు కట్టుకుంటే మా చెల్లెలు ఎంత అందంగా వుందో అంటూ ఆ వంకన ఫోను చేసి మాటలు మొదలుపెట్టాడు. రోజుకి ఏదో వంకతో ఫోనులు రావడంతో మనీషాకూడా ఓ నెల రోజులలో అతని ఫోను లేకపోతే తోచని స్థితికి వచ్చింది. అంతే కాక ఏ పదిహేను ఇరవై రోజులకో ఆదివారం నాడే మనీషా తండ్రి ఇంట్లో వుండే రోజు చూసి ఇంటికి వెళ్ళేవాడు! ఏం తోచడం లేదుసార్. ఈ ఊర్లో నాకు పెద్దగా ఎవరూ స్నేహితులు లేరు. మిమ్మల్ని డిస్ట్రబ్ చేయడం లేదుగదా' అంటూ ఆయనతో చనువు పెంచుకోడానికి ప్రయత్నించేవాడు. రాజకీయాలు బిజినెస్ విషయాలు, దేశ విదేశాల సంగతులు చాలా ఆసక్తి చూపిస్తూ మాట్లాడి ఆయన్ని ఇంప్రెస్ చెయ్యడానికి తాపత్రయపడేవాడు. మధ్యాహ్నం అయితే లంచ్ టైములో 'ఖానా ఖాఖే జానా దివాకర్ జీ' అనిపించుకునేవాడు. ఆదివారం సాయంత్రాలు సాధారణంగా వాళ్ళంతా బయట డిన్నర్ చేసే అలవాటు-దివాకర్ ఇంట్లో వుండటంతో ఆహ్వానం అందించాల్సి వచ్చేది. 'నో... నో...' అంటూనే కాసేపు ఇబ్బంది నటించి ఒప్పుకునేవాడు. రెండు నెలల్లో ఆ యింట్లో నెమ్మదిగా స్వేచ్చగా వచ్చిపోయే స్థానం కల్పించుకున్నాడు. మనీషా తండ్రి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *