మొండి 13 ఒక్క ఫోటో – ఒక ప్రాణం

By | March 12, 2020
telugu stories kathalu novels మొండి 13 ఒక్క ఫోటో - ఒక ప్రాణం " జూమ్ చెయ్యి రాజేష్ " అని వీరు అడిగాడు. జూమ్ చేసి ఏమి కనపడటం లేదు. మసక మసకగా ఉంది. ఆ బాటిల్ ని షార్ప్ చేసి చూద్దాం. అన్నాడు. బాస్ కి చిన్న హోప్ వచ్చింది. రాజేష్ షార్ప్ చేస్తున్నాడు కానీ , అక్షరాలూ ఏవి కనపడటం లేదు. అప్పుడు వీరు అడిగాడు. ఫోటోషాప్ లో ఒక్కసారి ఇన్వెర్ట్ ఆప్షన్ వాడి చూద్దాం అన్నాడు. రాజేష్ అన్నట్టుగానే చేసి , జూమ్ చేసి చూపించాడు. అనుకున్నట్టే వచ్చింది. ఫోటో మొత్తం నలుపు , ఆ కాస్త ప్రాంతం మాత్రం చిన్న చిన్నగా బ్లర్ అయినట్టుగా అక్షరాలు కన్పిస్తున్నాయి. వీరు "ఇప్పుడు ఆ అక్షరాలు మసకగా ఉన్న చోట కాస్త షార్ప్ చేసి చూడు. ఆ బ్యాచ్ నెంబర్ , మిగతా డీటెయిల్స్ వస్తాయేమో." అన్నాడు. బాస్ కి షాక్ కొట్టినట్టు అయ్యింది. అంతే , అనుకున్నది తడవుగా రెట్టించిన ఉత్సాహంతో , మెడికల్ ఇంచార్జ్, రాజేష్ ఇద్దరూ నోట్ చేసుకున్నారు. వీరు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. వీరు " మెడికల్ సార్! ఆ మెడిసిన్ ఏమయ్యుండొచ్చు ?" ఇప్పుడు తట్టింది బుర్రకి ఐడియా. " అది ఒక రకమైన sedative. నొప్పి తట్టుకోలేక నిద్రరాని వాళ్ళు వాడతారు. " బాస్ కి సీన్ అర్ధం అయ్యింది. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసాడు. మానుఫాక్చర్ డేట్ బట్టి , అవి ఎక్కడి నుండి వచ్చి ఉండొచ్చో కనుక్కోమన్నాడు. సరిగ్గా అయిదు నిమిషాలలో , "ఇది రెగ్యులర్ గా వాడే మెడిసిన్ కాదు. పైగా ఇప్పుడు ఆ మెడిసిన్ మార్కెట్ లో వాడటం లేదు. ఎక్కడో కొన్ని షాప్స్ లో తప్ప. ఆల్టర్నేటివ్స్ వచ్చేసాయి.కొన్ని కొన్ని స్టోర్స్ లో మాత్రమే అమ్ముతూ ఉండొచ్చు" అని సమాచారం ఇచ్చారు. వెంటనే ఫోన్ చేసి ఎక్కడెక్కడ అమ్ముతున్నారో కనుక్కో, రెండు నెలల్లో అని తిరిగి పురమాయించాడు బాస్. రాత్రి అయిదు అయ్యింది. ఐటీ వాళ్ళు రాకెట్ స్పీడ్ లో అది పంజాగుట్టలో నిమ్స్ కి ఎదురుగా ఉన్న షాప్ లో అమ్ముతున్నారని చెప్పాడు. మిగతా అపోలో , హెటేరో వాళ్ళు ఇదే ఫార్ములాతో వేరే టాబ్లెట్స్ అమ్ముతున్నారని తెలిపారు. బాస్ కి , టీం మొత్తానికి లింక్ దొరికింది. అయితే , అవి నిద్ర మాత్రలు కాబట్టి , డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరూ కొనరు. అంటే ,తక్కువ మందే కొంటారు. ఆ షాపులో ఎంత మంది కొన్నారు , ఏయే డాక్టర్లు ( గుర్తొచ్చినంతవరకు ) ప్రిస్కిప్షన్స్ గుర్తున్నాయో కనుక్కోమని ఆర్డర్ చేసాడు బాస్. అంతే , మొత్తం కలిపి పది మంది పేర్లు , ఫోన్ నంబర్స్ వచ్చాయి. దాంట్లో 3 పేర్లు ఈ మధ్యన కొన్నవారిగా

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *