మొండి 22 నీ కోసం

By | March 22, 2020
telugu stories kathalu novels మొండి 22 నీ కోసం (పాఠకులకు క్షమాపణతో: ఇన్ని రోజులుగా పలు వ్యక్తిగత కారణాల రీత్యా ఈ మొండి ని అత్యంత మందకొడిగా రాస్తూ వస్తున్నాను. కానీ, మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నిజంగా తిరిగి రాయడం పట్ల ఆసక్తి కలుగుతోంది. మీకోసమే ఈ మొండి ఇకపై నిర్విరామంగా రాస్తాను. ఆలస్యానికి క్షమించకండి, ఈ ఒక్క సారికి ప్రేమించండి)" ఇలా ఎప్పుడు దాకా?" దివ్య మాటలకు తిరిగి స్పృహలోకి వచ్చాడు వీరు. ఆఫీసు నుండి దివ్య తో కాఫీడే కి వచ్చిన మనిషి అదే మూడ్ మైంటైన్ చేస్తున్నాడు. నిజానికి ఇలా రిస్క్ చేసేటప్పుడు చెప్పుకోవడానికి రెండో మనిషి అన్నా ఉంటే కాస్త రిలాక్స్ గా ఉంటుంది. కానీ, మరీ 24 కుర్రాడైన వీరుకి అవన్నీ ఎలా వీలవుతాయి. దానికి తోడు "ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగే ఫ్రెండ్స్ గోల ఒకటి. దివ్య దగ్గరేమో అసలు ఏది దాచకూడదు.చెప్పెయ్యాలి అన్నీ అని టెంప్టింగ్ గా అనిపిస్తోంది. సరే ఏదైతే అది అయ్యింది , ముందు దివ్య తో ఉన్న టైం ప్రాపర్ గా స్పెండ్ చెయ్యాలి అనుకున్నాడు. " అలా ఏమి లేదు దివ్య. కొన్ని రోజులు పడుతుందిగా గాయం మానడానికి " " నాకు తెలుసు వీరు. రవి సార్ నీకు ఎంత క్లోజ్ అని. కానీ, ఎక్కడో ఒక చోట ప్రతి మనిషి మనకు అనుకోకుండా దగ్గరవుతూనే ఉంటారు. దూరం అవుతూ కూడా ఉంటారు. మనల్ని మనం అందుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూనే జీవించాలి. లేదా బ్రతకలేం " " నిజమే దివ్య . కానీ , రవి సార్ విషయంలో మాత్రం నావల్ల పొరపాట్లు కొన్ని జరిగినాయి . అందుకే బాధ తట్టుకోలేకపోతున్నా " దివ్య వీరు చెయ్యి పట్టుకుంది. ఆ సడన్ ప్రవర్తన కి వీరు కి షాక్ తగిలినట్టు ఫీల్ అయ్యాడు. తాను ప్రతి క్షణం కోరుకునే మనిషి దివ్య . ఆమె పట్టించుకుంటే ప్రపంచం మొత్తం తన వైపే నడుస్తున్నట్టు ఉంటుంది తనకి. ఆ ఫీలింగ్ ఏ మళ్ళీ కలిగింది. "వీరు నేనొకటి చెప్పనా " " మ్మ్ " " నిన్ను నేను నాలుగు సంవత్సరాలుగా చూస్తున్నాను. నీగురించి అన్నీ తెలిసిన ఫ్రెండ్స్ లో

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *