మొండి 33 డ్యాం

By | April 3, 2020
telugu stories kathalu novels మొండి 33 డ్యాం "వీరు! శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చేసాము. లే లే " అన్న రాజేష్ మాటలకు మెలుకువ వచ్చింది. ఏదో కావేరి ట్రావెల్స్ బస్సు లో అమీర్పేట్ వచ్చేసాం అన్నట్టు చెప్పాడు అనుకున్నాడు వీరు. సగం సగం నిద్ర పట్టిన కళ్ళతోనే నులుముకుంటూ ఫ్లయిట్ దిగి వచ్చేసారు. వచ్చి రాగానే , NIA ఆఫీసుకి తీసుకెళ్లిపోయారు. అక్కడే గెస్ట్ రూమ్ లో 20 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాడు వీరు. మధ్యలో దివ్య, రూమ్ లో మరిచిపోయిన ఫోన్ గుర్తుకు వచ్చి " అబ్బా " అనుకున్నాడు. కానీ కాల్ చెయ్యడానికి కూడా ఎవ్వరూ గ్యాప్ ఇవ్వడం లేదు. సాయంత్రం ఫోన్ చేద్దాం లే అనుకుంటూ, అలానే పనిలో పడిపోయాడు. ఆఫీసులోనే మీటింగ్ పాత కొలీగ్స్ అందరినీ ఒక్కొక్కరితో పలకరింపులు అన్నీ పూర్తయ్యాక , టాపిక్ కి వచ్చారు అందరూ. "ఇది టెర్రరిస్ట్ దగ్గర ఫోన్ లో వచ్చిన ఒక మెయిల్ , పాకిస్తాన్ లో ఒక ఐపీ అడ్రెస్స్ నుండి వచ్చింది ఇది. ఎవరికీ అర్ధం కానీ భాషలో రాసి పెట్టాడు అది. వాడు చేసిన తప్పల్లా అది ఎనిగ్మా కోడ్ లో రాసుకున్నాడు [ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎనిగ్మా అనే కోడింగ్ పద్దతిని జర్మన్లు వాడారు. దాని ద్వారా రహస్యంగా సమాచారాన్ని పంపించుకుంటూ ఉండే వాళ్ళు. ఆ కోడ్ ని 1941 లో బ్రేక్ చేసిన తరువాతే , జర్మన్ల ఓటమి మొదలయింది అంటారు ] ఎప్పుడూ రెండవ ప్రపంచంలో జర్మనీ లో వాడిన ఎనిగ్మా కోడ్ టెక్నీక్ ని వాడి రాసారని కనుక్కోవడానికి మాకు ఒక 3 రోజులు పట్టింది. దాంట్లో వాడు చెప్పిన మాటలు అన్నింటికీ అర్ధం వెదికితే నాగార్జున సాగర్ దగ్గర కొచ్చేసింది అని అన్నట్టు అర్ధం అయ్యింది. "

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *