మొండి 36 మెహదీపట్నం

By | April 6, 2020
telugu stories kathalu novels మొండి 36 మెహదీపట్నం బ్రిడ్జ్ కింద పేలుడు శబ్దానికి ఒక్క సారిగా ఉలిక్కి పడి కారు ఆపించాడు వీరు. అతనితో పాటు చాలా మంది తమ తమ వాహనాల్ని ఆపేసి చూస్తున్నారు. మెహదీపట్నం దాటిన తరువాత వచ్చే పెట్రోల్ బంక్ అది. ఆ బంక్ నుండి మంటలు , చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. అవి అంతెత్తున లేచి , పక్కన ఉన్న అపార్ట్మెంట్ కి కూడా మెల్లగా అంటుకున్నాయి. హైదరాబాద్ లో తరచూ జరిగే ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి అనుకున్నాడు. ఉన్నట్టుండి అతనికి గుర్తుకు వచ్చింది. పక్కనే , ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంది. ఏదైనా కేసు జరిగినప్పుడు డీ.యన్.ఏ సాంపుల్స్ ని పంపించడానికి ఆ ల్యాబ్ లో టెస్ట్ జరుగుతుంది. జస్ట్ 400 మీటర్ల దూరానికి ఆ మంటలు వ్యాపించడం తేలిక అయితే కాదు. అలాగని అసంభవం కాదు. వీరు కి "ఇది కావాలని చేసిన బ్లాస్ట్ ఆహ్. లేకపోతె ఎవరైనా ముష్కరుల చర్యనా?" అన్న ఆలోచన ఒకటి మనసులో మెదిలింది. కారు డ్రైవర్ కి డబ్బిచ్చి పంపించేసి , వెనక్కి నడుచుకుంటూ వెళ్లి ఆ ప్రదేశం దగ్గర దాకా వచ్చాడు. ప్రజలు అందరూ భయం తో ఎక్కడికక్కడ పరుగులు తీస్తున్నారు. నిప్పులు భయంకరం గా మండుతున్నాయి. ఆకాశంలోకి అగ్నిగోళాలు వెళ్తున్నట్టు వస్తున్నాయి మంటలు. వీరు అనుకున్నది నిజం అనిపిస్తోంది. ట్రైనింగ్ లో క్రిమినల్ మైండ్ సెట్ ని బాగా స్టడీ చేసే అవకాశం రావడంతో , ఒక రకమైన క్రిమినల్ థింకింగ్ వీరు కి కూడా అలవాటు పడిపోయింది. ఒక వేళ తానే క్రిమినల్ అయితే, ఈ సంఘటన ద్వారా ఏమి సాధించగలనా అంచనా వేసుకుంటున్నాడు. అందులో భాగంగానే , చుట్టూ ఉన్న మనుషులని గమనిస్తున్నాడు. ఎక్కడి జనాలు అక్కడ బిక్కు బిక్కు మంటూ పరుగులు తీస్తున్నారు. కరెంటు వారు ఇంకా కరెంట్ తీయలేదు. వైర్ లు కూడా అంటుకుని అటు వైపు ఎవరైనా వెళ్ళడానికి , పక్కనున్న అపార్ట్మెంట్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *