మొండి 37 పులవమా దాడి

By | April 7, 2020
మొండి 37 పులవమా దాడి హైదరాబాద్ నుండి తిరిగి ముంబై చేరుకొని తన రూమ్ కి వచ్చేసాడు వీరు. కాసేపు పడకేసి నెమ్మదిగా ఆఫీసు వైపుకి వెళ్ళిపోయాడు. అక్కడ బాస్ కి రిపోర్ట్ చేసి వెళ్లి తన క్యాబిన్ లో కూర్చున్నాడు. తనతో పాటు రిక్రూట్ అయిన చేరి ఒక్క రోజు కూడా కాలేదు. కానీ , ఎన్ని వింతలు చూశానో అనిపించింది. రెండవ రోజే హైదరాబాదు వెళ్లాల్సి రావడం, అక్కడ నుండి జరిగిన సంఘటనలు అన్నీ తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నిజమే వీరు , కేవలం మూడు రోజుల ప్రయాణం లో ఎన్ని చూడాల్సి వచ్చింది. ఏంటో ఈ విచిత్రమైన ఉద్యోగం , దివ్య ని కలవలేం , దివ్య ని చూడలేం , దివ్య కి నిజం చెప్పలేం, దేశం గురించి ఆలోచించి త్యాగం చేసేందుకు ఇది సరైన వయసు కాదేమో. ఇంకా నాకు ఆ పరిణితి రాలేదేమో అనిపించింది. ఇంతలోపలే నిన్న జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తాను గనుక ఇలాంటి ఉద్యోగం ఎంచుకోక పోతే ఆ నలుగురు ప్రాణాల్ని కాపాడే వాడినా. అసలు అలా కాపాడటం లో ఉన్న కిక్ ఏ ఉద్యోగంలో వస్తుంది. ఇలా రెండు వైపులా ఆలోచనలు తడుతూ ఉన్నాయి వీరు ని. మధ్యాహ్నం మూడు అవుతోంది. వీరు బయటకు వచ్చి చిన్న హోటల్ లో భోజనం చేస్తూ ఉన్నాడు. రెండు ముద్దలు నోట్లో పెట్టుకోబోతున్నాడో లేదో , ఆ క్షణమే కాల్ వచ్చింది. విసుగు మొహం పెట్టి ఓపెన్ చేసాడు ఫోన్ లాక్. బాస్ నుండి డైరెక్ట్ గా ఫోన్. " వీరు ! కహా హాయ్ తుం " " సార్ ! ఖానే కేలియే బాహర్ ఆయా " " Throw it and come to office. We have no time " విపరీతమైన ఆందోళన వినిపించింది ఆ స్వరంలో. "ఎప్పుడు చూసినా ఈ టెన్షన్ పనులేంటి? "అని లోలోపల అనుకున్నాడు వీరు. వెంటనే ప్లేట్ పడేసి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *