మొండి 39 తీవ్రవాది ఇంటర్వ్యూ

By | April 10, 2020
telugu stories kathalu novels మొండి 39 తీవ్రవాది ఇంటర్వ్యూ ముచ్చెమటలు పడుతున్నాయి వీరు కి. ఎదురుగా భారత ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రాణావస్థలో కనపడుతున్నాడు. ఏమి చెయ్యాలో ఆలోచించడానికి టైం లేదు. ఒక్క ట్రిగ్గర్ నొక్కితే ఒక చరిత్ర అంతం అయిపోతుంది. అదే , ట్రిగ్గర్ ని ఆపగలిగితే కొత్త చరిత్ర మొదలవుతుంది. వీరు చేతిలో చాలా పెద్ద టాస్క్ పడింది. ఆ పని చెయ్యడానికి 2 క్షణాలు పడుతుంది, కానీ ఆ రెండు క్షణాలు 20 సంవత్సరాల పాటు భారత దేశాన్ని శాశించగలవు. వీరు కి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ముక్కు లోనుంచి కూడా గాలి వేడిగా వస్తోంది. ఏం చెయ్యాలి? ఎలా కాపాడాలి. క్షణాలు గడిచిపోతున్నాయి. అవతలి వాడిలో నుండి మాట కదలిక ఇంకా రాలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు వీరు , అజిత్ సార్ ని కాపాడాలి అంటే ఒకటే దారి , తన ప్రాణం అడ్డు పెట్టడమే. దేశం కోసం నిత్యం బ్రతికే వాళ్ళ కన్నా తన త్యాగం ఏపాటిది అనిపించింది? అది అమలు చేద్దాం అనుకునే లోపల ఇంకో ఆలోచన వచ్చింది. ట్రైనింగ్ లో నేర్పించిన మెలుకువ. తైక్వాండో కిక్. మిగతా వాళ్ళలా వీరు కాళ్ళు స్ట్రెచ్ అవ్వవు. అది ఒక మైనస్ అయితే , అతని కదలికలో వేగం ఎక్కువ. అనుకున్నది తడవుగా ఊపిరి లోపలోకి తీసుకున్నాడు. గాల్లోకి జంప్ చేసి తీవ్రవాది చేతిపై కిక్ కొట్టాడు. నరం మీద తగలడంతో గన్ను పక్కకి పోతూ , వేలు ట్రిగ్గర్ నుండి వెనక్కి వెళ్ళింది. ఆ కాస్త గ్యాప్ లో వీరు మరో రెండు కిక్ లతో ఆయుధాన్ని చెదరగొట్టాడు. పక్కనే ఉన్న ఇటుకని తీసుకుని అతన్ని చంపబోయాడు. ఆఫీసర్ అజిత్ అతన్ని ఆపాడు. " వీడు ఇందాక మనకేదో చెప్తున్నట్టు చాలా సీన్ చేసాడు ... తీసుకెళదాం ఫస్ట్ " అని అన్నాడు. వీరు కూడా అందుకు తల ఊపాడు. అప్పటికి ఇండియన్ ఆర్మీ కార్ ఒకటి అక్కడికి వచ్చేసింది. పేలుడు శబ్దం వల్ల వాళ్ళు అలర్ట్ అయ్యారు. అక్కడ ఉన్న అజిత్ సార్ ని చూసి సెల్యూట్ కొట్టి. వీరు , పాకిస్తాన్ స్పై ని తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తం మీద ఒక చిన్న లింక్ అన్నా ఇంటికి పట్టుకెళ్ళాలి అన్న ప్రయత్నం కాస్త తృప్తి ని ఇచ్చింది. వయసులో ఉన్నాడు గా వీరు , ఈ విషయం చాలా మందికి చెప్పాలి అనిపిస్తోంది. కానీ , ఉద్యోగ ధర్మం వేరు. అందుకే ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుతున్నాడు. పొద్దున్న సమయానికి అతన్ని తీసుకెళ్లి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *