మొండి 8 ఇంకొన్ని అడుగులు

By | March 6, 2020
telugu stories kathalu novels మొండి 8 ఇంకొన్ని అడుగులు నేరుగా వెళ్లి ఆఫీస్ లో ఉన్న రవి సార్ ని కలిసాడు. " హే ! వీరు రా నాన్నా " " సార్ " అని వీరు ఇంకో మాట మాట్లాడే లోపల అందుకున్నాడు రవి సార్ " అర్జెంట్ గా మనం బయటికి వెళ్ళాలి " " లక్డి కపూల్ కే కదా సార్ " " కాదు ! అంతకన్నా వేరే ఇంపార్టెంట్ ప్లేస్ కి " వీరు కి కొత్త కన్ఫ్యూషన్ , మరి కొంత ఎక్సయిట్మెంట్. పోనీలే అని రెడీ అయ్యాడు. " నీకు బండి వచ్చా " " అంతగా నడపడం రాదు సార్ " అని సమాధానం ఇచ్చాడు వీరు. " నేర్చుకో వీరు. మనకి చాలా పని ఉంటుంది" " అవును సార్ అర్జెంట్ గా నేర్చుకోవాలి " అని సమాధానం ఇచ్చాడు. ఇద్దరూ కలిసి బైక్ లో పోతున్నారు. బండిలో పోతూ ఉండగా రవి సార్ రకరకాల కబుర్లు చెబుతున్నాడు. మధ్యలో " అవును ! వీరు. నువ్వు ఇలా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నట్టు ఎవరికైనా చెప్పావా ?" "లేదు సార్ " " సరిగ్గా చెప్పు ! ఈ వయసులో అంత ఎక్సయిట్మెంట్ ని ఎవ్వరూ ఆపుకోలేరు " " ఎక్కడ సార్. చెప్పుకోవడానికి కూడా టైం ఉంటే కదా " " కాదు కాదు. నువ్వు దివ్య కి ఏమన్నా చెప్పావా ?" కరెంటు షాక్ కొట్టినట్టు అలానే కొయ్యలా ఉండిపోయాడు వీరు కాసేపు షాక్ అయ్యాడు. " సార్. దివ్యతో ఒక్క సారే మాట్లాడాను. అది కూడా మీ టాపిక్ గుర్తొచ్చినప్పుడల్లా మాట చెప్పకుండా ఆపుకున్నాను కూడా " " లేదు వీరు. దివ్య కి నువ్వు ఎక్కడ కెళ్ళావు ఏమి జరిగిందో తెలుసు " వీరు కి ఇక ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎందుకంటే దివ్య ని కలిసినప్పుడు చెప్పాలి అని అనుకున్నా తనని తాను బాగా కంట్రోల్ చేసుకున్నాడు. మరి ఈ విషయం బయటికి ఎలా వచ్చిందా అని ఆలోచనలో పడ్డాడు. " నీ వాళ్లలోనే నీ గురించి స్కూప్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి నువ్వు చెప్పి ఉండవు వీరు . బట్ జాగ్రత్త " వీరు సైలెంట్ గా వింటున్నాడు. " ఇంకో మాట . ఈ వయసులో ఎక్ససిట్మెంట్ బానే ఉంటుంది. పిచ్చోడిని కలిసినా పేస్ బుక్ లో పది మందికి చెప్పాలని అనిపిస్తుంది. కానీ , నువ్వు ఇప్పుడు కలుస్తోంది అతి పెద్ద నెట్వర్క్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *