నైట్ క్లబ్ 2
telugu stories kathalu novels నైట్ క్లబ్ 2 ”అబ్బా రూపా… అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ ఒక్క రాత్రి మనం ఎంతో ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు…” అన్నాడు ఆమెని కన్విన్స్ చేస్తున్నట్లు…. ప్రకాష్ మొహంలోని అభ్యర్దనని గమనించి మౌనంగా ఉండిపోయింది స్వరూప. వారిద్దరూ ఒక టేబుల్ దగ్గరిక వచ్చి కూర్చున్నారు. డిన్నర్ కి ఆర్డర్ చేసిన తర్వాత స్వరూపకి ఇంకా కోపం తగ్గలేదని గ్రహించాడు ప్రకాష్.
”ఏయ్ స్వరూపా…. టేకిట్ ఈజీ…. వాళ్ళు ఫుల్లుగా మందు కొట్టి ఉన్నారు. అలాంటి వారు ఏదో అన్నారని అలా అప్ సెట్ అయిపోతే ఎట్లా…? మనం వచ్చింది ఇలా మనసు పాడు చేసుకుని వెళ్ళడానికి కాదు. మనసు నిండా ఆనందానుభూతుల్ని నింపుకోవడానికి…” అనునయించాడు ప్రకాష్. స్వరూప అలాగే మౌనంగా కూర్చుంది.
అటుగా వెళుతున్న యువకులు, వారికి కొద్ది దూరంలో కూర్చున్న యువకులు కూడా స్వరూపాని మింగేసేలా చూడటం గమనించాడు ప్రకాష్. అది గాని స్వరూప గమనిస్తే… కొ౦పల౦టుకుపోతాయనుకుని చటుక్కున అక్కడి నుండి లేచి నిలబడ్డాడు ప్రకాష్. స్వరూప అతని వైపు విచిత్రంగా చూసింది.
”పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం…”
”డిన్నర్ మన రూంలోకే తీసుకు రమ్మని చెబుదాం…”
మౌనంగా లేచి అతన్ని అనుసరించింది స్వరూప. ప్రకాష్ ఆ రిసార్ట్స్ మేనేజర్ తో మాట్లాడి… ఒక రూంని బుక్ చేసుకున్నాడు. వారికి గది చూపించమని బాయ్ తో చెప్పి అతను స్వరూప