ప్రేమాభిషేకం 11
naa telugu kathalu ప్రేమాభిషేకం 11 కా: నేను నిన్ను ఇలా అడగకూడదు, ఎందుకంటే విజయ్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాక నేనంటే నీకు ఇష్టమా ఆంటే కోపం వస్తుంది, కానీ ఎందుకో అడగకుండా ఉండలేకపోయాను మార్నింగ్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడే నిన్ను ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాకానీ అడగలేకపోయాను.. ఇప్పుడు అడగకుండా ఉండలేకపోతున్నా అందుకే ఇలా అడిగాను (తను తప్పు చేసింది అనే ఫీలింగ్ తన మాటల్లో తెలుస్తూనే ఉంది) తన మాటలు వింటున్న నాకు ఆనందంతో ఎగిరిగంతేయ్యలి అనిపిస్తుంది ఎందుకంటే తనకు నా మీద ప్రేమ ఉంది.కావ్య ఒకటి చెప్పనా నువ్వంటే నాకు ఇప్పటికి ఎప్పటికి ఇష్టమే...అది ప్రేమ కాదా అనేది మాత్రం నీకు ఇప్పుడే చెప్పలేను. ఇక విజయ్ తో వెళ్లి తిరిగిరావడం అంటావా అది తొందరపాటు వల్ల జరిగిన