ప్రేమాభిషేకం 20
naa telugu kathalu ప్రేమాభిషేకం 20 ఇక్కడ నేనేమన్నా పిచ్చి వేషాలు వేస్తే మొదట శివ గారికి తరువాత మావయ్యకి చెడ్డ పేరు వస్తుంది. అసలే మావయ్యకి నేనంటే చాలా ఇష్టం అలాంటిది ఇలా చేస్తే నాతో ఇంక ప్రేమ గా ఉంటారా ? ఇవన్నీ తెలిస్తే అమ్మ ఊరుకుంటుందా? వద్దు వద్దు ఇలాంటి తప్పు చెయ్యకూడదు అని నాలో నేనే కలవరిస్తూ బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్నా, ఇంతలో డోర్ మీద ఎవరో కొడుతున్న శబ్దంతో డోర్ వైపు చూసాను.డోర్ దగ్గర సంజు ఆంటీ అయోమయంగా నా వైపు చూస్తూ నిలబడుంది ? ఒక్క క్షణం నాకే అర్ధం కాలేదు ఏమైంది నాకు