రాజ్య సింహాసనం 17

By | November 23, 2019
రాజ్య సింహాసనం 17 అంతలో ఎవరో ఒకావిడ, “ఆగు,” అని వినిపించడంతో ఆదిత్యసింహుడు వెనక్కు తిరిగి చూసాడు. అక్కడ ఉన్నతాసనం మీద ఒకావిడ కూర్చుని ఉన్నది….ఆమె ముందు పల్చటి తెర లాంటిది ఉండటంతో ఆమె రూపు రేఖలు సరిగా కనిపించడం లేదు. ఆమె : ఇది ఖడ్గవిద్యా ప్రదర్శనమే కాని…యుధ్ధం కాదు కదా…. నిర్వాహకుడు : నిజమే యువరాణీ గారు….కాని ఈ ప్రదర్శనలో ఒకవేళ అతను గెలిచిన బహుమానాలు అతనికి ఇవ్వలేం కదా…. ఆదిత్యసింహుడు : నేను బహుమానాలు, బంగారు వరహాలను ఆశించి నేను రాలేదు….కేవలం వినోదం కోసమే పాల్గొన దలిచాను….ఒకవేళ నేను గెలిచినా కూడా అతన్నే విజేతగా ప్రకటించవచ్చు….నాకు ఎటువంటి అభ్యంతరం లేదు…. యువరాణి : అతను కేవలం వినోదం కోసమే అంటున్నాడు కదా….ఇందులో ఇబ్బంది ఏమున్నది…. యువరాణి అలా అడిగే సరికి నిర్వాహకుడు ఏం చెప్పాలో తెలియక రాజు వైపు చూసాడు. రాజు కూడా ఒకసారి తన కుమార్తె వైపు చూసాడు. ఆమె కూడా ఒప్పుకోమన్నట్టు సైగ చేయడంతో రాజు కూడా ఆదిత్యసింహుడిని పాల్గొనమన్నట్టుగా అనుమతి ఇచ్చాడు. దాంతో ఆదిత్యసింహుడికి, ఇంతకు ముందు గెలిచిన అతనికి మధ్య కత్తి యుధ్ధం మొదలయింది. ఆదిత్యసింహుడి ఖడ్గ విన్యాసం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికి అతను సామాన్యపౌరుడు కాదని అర్ధమయింది. యువరాణి కూడా ఆదిత్యసింహుడిని రెప్పవేయకుండా అతని వైపు, అతని ఖడ్గ విన్యాసాన్ని చూస్తున్నది. కొద్దిసేపటికి ఆదిత్యసింహుడు ఆ పోటీలో గెలిచాడు. కాని ఆ రాజ్యపు షరతుల ప్రకారం ఇదివరకు గెలిచిన అతన్నే విజేతగా ప్రకటించారు. అంతా అయిపోయిన తరువాత యువరాణి తన ఆసనం లోనుండి పైకి లేచి ఆదిత్యసింహుడిని చూపిస్తూ, “నేను ఇతనితో కత్తి యుధ్ధం చేయాలనుకుంటున్నా,” అన్నది. ఆమె అలా అనగానే ఆదిత్యసింహుడితో సహా, అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే ఆ రాజ్యపు రాజు, ఆమె తండ్రి అయిన యశోవర్ధనుడు, “ప్రభావతీ….ఏంటి ఈ విపరీత నిర్ణయం,” అన్నాడు. ప్రభావతి : లేదు నాన్నగారు….చాలా రోజుల తరువాత నాకు కత్తి యుధ్ధం చేయాలని అనిపిస్తున్నది…దయచేసి అనుమతి ఇవ్వండి…. దాంతో యశోవర్ధనుడు కూడా అది విద్యాప్రదర్శనే కాబట్టి యువరాణి ప్రభావతికి అనుమతి ఇచ్చాడు. అది చూసిన ఆదిత్యసింహుడు కూఆ ఆశ్చర్యపోయి వెనక్కు తిరిగి రమణయ్య వైపు చూసాడు. రమణయ్య కూడా ఏం చెప్పాలో తెలియక కానివ్వమన్నట్టు సైగ చేసాడు. కొద్దిసేపటికి యువరాణి ప్రభావతి తన రాజరికపు దుస్తులు వదిలేసి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *