రాజ్య సింహాసనం 2

By | October 25, 2019
రాజ్య సింహాసనం 2 వాళ్ళు శ్రధ్ధగా తన మాటలు వినడం చూసి, “అందుకని సాంప్రదాయం ప్రకారం అయితే పెద్దకొడుకు రాజ్యానికి వారసుడుఅవుతాడు….కాని,” అని రత్నసింహుడు తన పెద్ద కొడుకైన విజయసింహుడి వైపు చూసి, "నాయనా….నువ్వు యుద్ధవిద్యల్లోనురాజకీయాల్లోను నీకు అనుభవం లేదు….నిన్ను చక్రవర్తిని చేస్తే మన సామంతరాజులు స్వాతంత్రాన్ని ప్రకటించుకుని మన మీదతిరుగుబాటు చేస్తారు,” అని తన మిగతా ఇద్దరు కుమారుల వైపు చూసి, “మీరు ముగ్గురు ఒకసారి ఏకాంతంగా సమావేశం అయ్యిబాగా చర్చించుకుని…..ఎవరిని చక్రవర్తిగా చేస్తే బాగుంటుందో చెబితే వారికి రాజ్యాని అప్పజెప్పి నేను విశ్రాంతితీసుకుందామనుకుంటున్నాను,” అని అన్నాడు. అంతా విన్న తరువాత ఆదిత్య సింహుడు మాట్లాడదామని లేవబోతుండే సరికిరెండవ కొడుకైన వీరసింహుడు తన తండ్రితో, “నాన్నగారు….మేము మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళం కాదు….మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చేయండి…..మాలో ఎవరినిచక్రవర్తిని చేసినా మిగతా ఇద్దరం మీ నిర్ణయాన్ని ఆమోదించిఅంతా కలిసి ఉంటాము,” అన్నాడు. అప్డేట్ ః 2 దాంతో ఆదిత్యసింహుడు, “అవును నాన్నగారు….మీరు ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటాము,” అన్నాడు. అదివిన్న రత్నసింహుడు ఆనందంతో పొంగిపోతూ, “మీ వినయ విధేయతలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది….కాని భవిష్యత్తులో  విధమైనసమస్యలు రాకూడదు….ఎందుకంటే రాజ్యకాంక్ష అనేది చాలా విపరీతాలకు దారి తీస్తుంది…..అందుకని రాజ్యాన్ని మీ ముగ్గురికీ సమానంగా విభజించి మీముగ్గుర్ని రాజులుగా చేస్తాను…..ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మీ రాజ్యాలను పరిపాలించుకోండి,” అన్నాడు. నాన్నగారూ…..రాజ్యకాంక్ష అనేది చాలా విపరీతాలకు దారి తీస్తుంది….అది మాకు తెలుసు…..కాని రాజ్యాన్ని విభజించటం వలన సమస్యలు ఇంకాఅధికం అవుతాయిఅధికారం కూడా పలచబడి….ముందు ముందు ఇంకా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది….అందుకని నా సలహా ఏంటంటే పెద్దన్నయ్యఐన విజయ సింహుడిని చక్రవర్తిగా చేయండి….మేము ఇద్దరం ఆయనకి ఇరువైపులా ఉండి  రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాము…..ఇది నాసలహా మాత్రమే….తుది నిర్ణయం మాత్రం మీదే,” అని వీర సింహుడు తన అన్న తమ్ముడి వైపు చూసాడు. తమ్ముడి మాటలు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *