రాజ్య సింహాసనం 9
రాజ్య సింహాసనం 9 దాంతో కాపలావాళ్ళు మంజుల మెగుడిని, కొడుకుని అక్కడ నుండి తీసుకెళ్ళారు.అది చూసి మంజుల భోరున ఏడుస్తూ, “ప్రభూ…నన్ను క్షమించండి…వాళ్ళను వదిలేయండి ప్రభూ,” అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నది.
ఆదిత్యసింహుడు మంజుల చెయ్యి పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, “ఎంత ధైర్యం ఉంటే నా మీద గూఢచర్యం చేస్తావు…మర్యాదగా ఏం జరిగిందో నీ నోటితో చెప్పు…నాకు ప్రతి విషయం తెలుసు…కాని నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను…నువ్వు ఎవరికోసం ఈ కార్యాలన్ని చేస్తున్నావో నాకు తెలుసు…ఇప్పటికిప్పుడు నిన్ను అపరాధిగా నిరూపించి నీకు దండన విధించినా…ఎవరు నిన్ను రక్షించడానికి ముందుకు రారు…అందుకని ఇప్పుడు నువ్వు నీ నోరు తెరిచి నిజం చెప్పి నీ భర్త, కొడుకు ప్రాణాలు కాపాడుకో,” అన్నాడు.
ఆదిత్యసింహుడికి తన గురించి మొత్తం తెలిసిపోయిందని అర్ధం అయిన మంజుల ఇక జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పేసింది.
అంతా విన్న ఆదిత్యసింహుడు మంజుల వైపు చూసి, “ఇంతకు ముందు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే నాకు నీ గురించి తెలుసు మంజుల…నాకు నా దాసి అయిన ఉష గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు…అలాంటిది ఆమె పేరు చెప్పుకుని నా దగ్గరకు వస్తే నేను కనిపెట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు…నాకు నీ వలన ఇంకొక్క పని కావాలి… అది కనుక నువ్వు చేస్తే నువ్వు, నీ భర్త, కొడుకుతో పాటు నిరభ్యంతరంగా ఈ రాజ్యంలో నివసించవచ్చు…లేకపోతే నీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళొచ్చు,” అన్నాడు.
ఆదిత్యసింహుడు మెత్తగా మాట్లాడటం చూసి మంజుల కొద్దిగా