సౌందర్య గిరీ 44
naa telugu kathalu సౌందర్య గిరీ 44 నా మీద నాకే అసహ్యం వేసి నా ఫ్రండ్ జయ సాయం తో పోలీస్ కేస్ పెట్టాలని డిసైడ్ అయ్యాక ...నా దగ్గర ఉన్న బంగారు , కట్నం డబ్బు మొత్తం తీసుకుని దుబాయ్ కి చేక్కేసాడు.... నా బతుకు రోడ్డు పాలు అయింది...నా అన్న వాళ్ళు నన్ను కనీసం ఎలా ఉన్నావు అని కూడా చూడలేదు...నా ఫ్రెండ్ జయ సాయం తో ఇంటిరీయర్ డిజైనింగ్ పూర్తి చేసి ...బ్యాంక్ లోన్ తీసుకుని స్వయం శక్తి గ కాస్త పడి ...ఏదో జీవితాన్ని ఒంటరి గా లాగిస్తున్న సమయం లో దేవుడిలా వచ్చాడు గిరి ....అప్పటి నుండి నరక లోకం లాంటి నా బ్రతుకు కాస్త మెరుగు పడింది ....మళ్లీ గిరి వల్ల నవ్వుతున్నాను ....సంతోషంగా ఉన్నాను...అతని లో నా జీవిత భాగస్వామిని చుస్కొడం యాదృచ్ఛికంగా జరిగి పోయింది...
ఆకురాలిన వృక్షం లాంటి నాలో కొత్త చిగుర్లు వచ్చేలా చేశాడు ...ఇలాంటి మనిషి ని కోల్పోతే ఇంకా నా లైఫ్ కి అర్ధం ఉండదు ....నా జీవితాన్ని గిరి పాదాల దగ్గర ఉంచి అతన్ని నా స్వామి గా చుస్కోవాలని చిన్న ఆశ కలిగింది... ఇపుడు చెప్పండి శాంతమ్మ గారు , ఎడారి లాంటి నా లైఫ్ లో గిరిని కోరుకోవడం తప్పా...ఎవడో చేసిన ఎదవ పని