విజయ్ ఒక భర్త కథ 19
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 19 ముఖంపై నీళ్లు చల్లగానే నీరసంగా లేచిన రమ్య ఒకసారి చుట్టూ చూసింది..మళ్లీ తను జరిగింది గుర్తొచ్చి కార్ లో నుండి బయటకు పరిగెత్తుతూ విజయ్ కారు ఉన్న దగ్గరికి వస్తూ ఏమండీ.... ఏమండీ.....అంటూ బిగ్గరగా పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఏడుస్తుంది... చుట్టూ ఉన్న జనం అంతా ఆమె వైపు జాలిగా చూస్తున్నారు.కారు పక్కనే ఉన్న హారిక గాల్లోకి చూస్తూ ఉంది... అసలు ఇక్కడి లోకం లోలేదు ఏదో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు దీనంగా ఉంది.... రమ్య కార్ దగ్గరికి రాగానే ఎదురుగా వస్తున్న అజయ్ అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు కోపాన్ని ఒక్కసారిగా బయటికి కక్కి స్తూ ఇంకా ఎందుకు ఈ దొంగ ఏడుపులు?? ఎవరిని నమ్మించడానికి ??అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా.... పక్క ప్లాన్ తోనే నా అన్నను వేరే వాళ్ల ముందు చేతగాని వాడిలా నిలబెట్టి నీకు నచ్చినట్టు చేయాలని అనుకున్నావ్ నువ్వేం చేసినా నీ మీద ఉన్న ప్రేమ వల్ల నిన్ను ఏమీ అనలేక పోయేవాడు..... నేను కూడా నా అన్న గురించి కుటుంబం పరువు గురించి ఆలోచించి నీతో...... ఛీ.. అంతే తప్ప నీకున్న వందమంది మొగుళ్ల లో నేను ఒకడిని అని తెలీదు ఇంక నీకు లైన్ క్లియర్ అయిపోయింది.నిన్ను ఆపేవాడు లేడు మురళి గాడితో పోతావో లేక వాడి బాబుతో పోతావో నీ ఇష్టం నీకు ఎవ్వడైనా ఒకటే గా అంటూ రమ్య పై అరుస్తుంటే గౌతమ్ అజయ్ ని ఆపి అందరూ చూస్తున్నారు.. ఇక్కడ బాగోదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద..... అంటూ అజయ్ ని లాక్కొచ్చేశాడు.... రమ్య కు ఏడ్చి ఏడ్చి గొంతు తడారిపోయింది.... అజయ్ అన్న ప్రతి మాట తన చెవుల కు తూట్లు పడేలా చేశాయి.తన పెళ్లి అయిన ఈ పదిహేను సంవత్సరాల్లో