ఈ రాత్రి నీకు బహుమతి 9

By | February 18, 2019
సుమతి బిందెతో నీళ్ళు చేదుకుని వచ్చేసింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. నెల తప్పితే ఏం చేయాలన్నది ప్రశ్న. అదే భయం గుండెల్లో కాపురం పెట్టేసినట్టుంది. సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తోంది. అయిదు గంటల ప్రాంతాన నారాయణ ఇంటికి రావడం కనిపెట్టింది. ఏం కారణం చెప్పి నారాయణ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది. వంట ప్రారంభించింది. కూరలో వేయడానికి చిటికెడంత మిరప్పొడి వుంది. అది సరిపోతుంది కూరకి. కానీ దాన్ని పెరట్లో కిందపోసి వరండాలో విస్తర్లు కుట్టుకుంటున్న తల్లి దగ్గరికి వచ్చింది. "మిరప్పొడి అయిపోయింది. మరిప్పుడు కూర్లోకి ఏమెయ్యమంటావ్?" అని అడిగింది విసుగ్గా. "కొద్దిగా వున్నట్టుందే" "ఏం లేదు" "మరి ఆ ఎదురింటికన్నా వెళ్ళి బదులు అడిగి తీసుకో" "ఆ పిల్ల చేయి విదల్చడం లేదు ఏమడిగినా" "మరిక ఏం చేద్దాం? నారాయణ ఇంటికన్నా వెళ్ళు" ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న సుమతి ఠక్కున నారాయణ ఇంటికి బయల్దేరింది. నాగభూషణం వీధి అరుగుమీద కూర్చుని ఎద్దులకు ముక్కు తాళ్ళు పేనుకుంటున్నాడు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *