శృంగార నగరం 14

By | February 20, 2019
ఆయనలో చిన్న కదలిక.   "అతనితో వుంటావా?" కాసేపు మౌనం తరువాత అడిగారు.   "బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను."   "పిల్లలు?"   "మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం. అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను."   "ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన  బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా  తర్వాత సర్దుకున్నారు."                                         *    *    *   "జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి.   ఊరికి వచ్చీ రాగానే "బయల్దేరు" అన్నాడు.   "ఎక్కడికీ?"   "ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి  వచ్చెయ్యమని చెప్పాను గదా" నొచ్చుకుంటూ మాట్లాడాడు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *