శృంగార నగరం 21

By | February 20, 2019
"ఛీ! ఛీ! సినిమాకు  రావాలంటే ఇదే విసుగు. ఆకతాయి  కుర్రాళ్ళంతా  ఠంచనుగా రడీ అయిపోయి వుంటారు" అంది ధవళ అబ్బాయిల్ని చూస్తూనే నా చెవులో. "ఆ భాస్కర్  చూడు- ఏం స్టయిల్ గా  వున్నాడో, ఏజీ బియస్సీ చదివాడు గానీ  హుందాగా ప్రవర్తించాలని తెలీదు. సాయంకాలమైతే సినిమాకు తయారు."   అతను మాకు బావ వరసవుతాడు. అంతమంది అబ్బాయిల ముందు నడుస్తుంటే నాకు తెలియకుండానే అడుగులు తడబడ్డాయి. మిగిలినవాళ్ళు పరిస్థితి కూడా అంతే. అయితే ధవళ మాత్రం అక్కడ అబ్బాయిలు లేనట్టే చాలా నిర్లక్ష్యంగా నడిచింది. నాకూ అంత ఒద్దికగా వుండాలనిపించింది గానీ వీలుకావడం లేదు.   వెనుక వస్తున్న అబ్బాయిలు మాకు వినపడేటట్లు ఏవేవో జోక్ లు వేస్తున్నారు. భాస్కర్ అయితే మరీ  రెచ్చిపోతున్నాడు.   ధవళ మాత్రం  అబ్బాయిల జోక్ లు  పట్టించుకోకుండా తను ఏదేదో  మాట్లాడుతోంది గానీ నేను వినటం లేదు. నా చెవులు వెనక్కి మళ్ళి అబ్బాయిల జోక్ లను వినటానికే ప్రయత్నిస్తున్నాయి. ధవళలా ఎలాంటి ఆవేశం, ఉద్రేకం లేకుండా మేము  వుండలేకపోతున్నాం.   అంతలో  టూరింగ్  టాకీసు  వచ్చింది.   జనం పెద్దగా  లేరుగానీ ఫరవాలేదు అన్న స్థాయిలో వున్నారు. సినిమా బిగిన్ కావటానికి ఇంకా  టైము వుంది. బయట నిలుచున్నాం.   అంతలో వనజ  వాళ్ళ అన్నయ్య  లోపలికి వచ్చాడు. నన్ను చూసి  ఎప్పుడొచ్చావని పలకరించాడు. అక్కడ అమ్మే డ్రింక్స్ లో కాస్ట్ లీ డ్రింక్ రోజ్ మిల్క్ అందరికీ వాటిని తెప్పించాడుగానీ ధవళ మాత్రం  తీసుకోలేదు.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *