అమ్మాయి ప్రేమ పరిణయం 29

By | March 2, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 29"సరే నీ ఇష్టం" అంది రవళి ఆ రోజు ఉదయమే ఆరు గంటలకే సారిక చరితని, ముక్త ని లేపేసింది. చరిత బద్దకంగా "అబ్బా ఏంటే మరీ ఎంత ఇవాళ నీ పుట్టిన రోజైతే మాత్రం మమ్మల్ని ఇంత పొద్దున్నే లేపాలా" "అదే కదా..రాత్రంతా కష్టపడి నీ కోసం ఎన్ని ఎరేంజ్మెంట్స్ చేసాం ఆ మాత్రం కృతఙత లేదా నీకు మరీ ఇంత పొద్దున్నే లేపేస్తున్నావు" అంటూ చరితకి వంత పాడి దిప్పటి ముసుగేసింది ముక్త. సారిక దుప్పటిని తీసేస్తూ "ఇవాళ మీ ఆటలేం సాగవు మీరు చెప్పేది ఏది నేను వినను. ఇవాళ నా పుట్టిన రోజు సో ఈ రోజు మొత్తం నాది. ఇవాళ ప్రోగ్రాం అంతా నేను ప్లాన్ చేస్తాను. ముందు మీరిద్దరూ లేచి స్నానం చేసి రెడీ అవ్వండి గుడికి వెళ్దాం." "అబ్బా ఆ గుడి ఎక్కడికి పోతుందే అక్కడే ఉంటుంది. ఒక అరగంట తరువాత వెళ్లినా ఏం కాదు మమ్మల్ని ఇంకొంచం సేపు పడుకోనివ్వు" అంది చరిత "మీరిప్పుడు లేస్తారా లేదా..లేదంటే ఒక బకెట్ వాటర్ తెచ్చి మీ మొహాన కొడతాను. మీ నిద్రతో పాటు మీ బెడ్ కూడా పాడవుతుంది. రోజంతా దాన్ని ఎండ లో పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది మీ ఇష్టం" అంటూ ఆ రూం కున్న కిటికీ తలుపులన్నీ తీసేసింది. అప్పుడే తెల్లవారుతోంది ఆ వెలుతురంతా గది మొత్తం లో పరుచుకునేసరికి వాళ్ళకి కళ్ళు మూసుకుందామన్నా కుదరలేదు "రాక్షసి వే నువ్వు. మా నిద్ర చెడగొట్టందే నీకు ప్రశాంతంగా ఉండదు కదా" అంటూ మంచం దిగారు ఇద్దరూ. వాళ్లందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళారు. దర్శనం చేసుకొని ఒక పక్కగా వచ్చి కూర్చుని గుడిలో పెట్టిన ప్రసాదం తింటున్నారు. చుట్టుపక్కల చూస్తున్న ముక్త అంది "ఈ గుడి చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ" "అవును ఇది చాలా పాత కాలం నాటి గుడి. దాదాపు యాభయి సంవత్సరాలయుంటుంది ఈ గుడి కట్టి. కానీ ఇది మనింటినుంచి కొంచం దూరం" అంది సారిక ముక్త చుట్టుపక్కల చూస్తూ కూర్చుంటుంది. అసలే వర్షాకాలం. ఇంకా ఎండ పూర్తిగా రాలేదు. చల్లని గాలి వాళ్ళని తాకుతూ ఉంటే మనసుకి హాయిగా ఉంది. ఆ వాతావరణం ముక్త కి బాగా నచ్చింది. "ఇంత మంచి వెదర్ లో ఇక్కడ కూర్చోవడం కన్నా అలా గుడి మొత్తం తిరిగొస్తే బావుంటుంది వెళ్దామా." అంది ముక్త "ఇప్పుడా..నా వల్ల కాదు బాబోయి నేను ఇక్కడే కూర్చుంటా" అంటుంది చరిత "నేనూ ఇక్కడే చరిత తో పాటు ఉంటా నువ్వేళేసి రా" అంటుంది సారిక "సరే మీ ఇష్టం ఇంత మంచి సీనరీని మిస్ అవుతున్నారు" అంటూ తను లేచి వెళ్తుంది. గుడి మొత్తం చూస్తూ గుడి వెనక్కి వెళ్ళిన ముక్త కి "హలో ముక్తా ఎలా ఉన్నావు" అన్న పలకరింపు వినబడేసరికి ఎవరా అని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి అతన్ని చూసిన

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *