మొండి 4 క్యాంటీన్

By | March 2, 2020
telugu stories kathalu novels మొండి 4 క్యాంటీన్ 2013 MGIT కాలేజీ. వీరు, బి.టెక్ చదువుతున్న రోజులు. నాగార్జున సాగర్ టూర్ కి వెళ్లి వచ్చి వారం రోజులయ్యింది. ఎవరి కాలేజీ పనుల్లో సరదాగా క్లాస్ లకు వెళ్తూ అటెండన్స్ పెంచుకునే పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వీరు కాన్సంట్రేషన్ మొత్తం రెండే రెండు విషయాల పైన ఉంది. ఒకటి దివ్య పై రోజు రోజుకి పెరిగిపోతున్న ఫీలింగ్స్. రెండవది, రవి సార్ మిన్న చెప్పిన భయంకరమైన విషయం( డ్యామ్ బ్లాస్ట్). దివ్య అప్పటికి పరిచయం అయ్యి రెండేళ్లు అయ్యింది. జాయిన్ అయిన మొదటి సంవత్సరంలో తనకు పరిచయం అయిన ఫ్రెండ్ తాను. పల్లెటూరు నుండి, అదీ కూలి కుటుంబం నుంచి రావడంతో అందరితో కలవడానికి బెరుకుగా ఇబ్బంది పడుతున్నప్పుడు, తనకు కొత్త ప్రపంచం పరిచయం చేసింది తానే. డ్రెస్సింగ్ సెన్స్ నుండి , పాకెట్ మనీ ఇవ్వడం దాకా ప్రతీది ఇచ్చింది తానే. ఊర్లో తాను వేసుకునే మాములు గళ్ళ చొక్కా, కుట్టిన కాటన్ ప్యాంట్ నుండి జీన్స్ టి-షర్ట్ దాకా అన్ని విషయాల్లో తనే వీరు కి గైడ్. దివ్య తరువాత అంత influence చేసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. 6 అడుగుల ఎత్తు, చక్కని ముఖం, కష్టం చెయ్యడం వల్ల వచ్చిన శరీర సౌష్టవం ఉండటం తో వీరు కి ఫాలోయింగ్ బానే ఉంది. కానీ, ఎంత మంది మాట్లాడినా దివ్య కనిపిస్తే చాలు ముఖం వెలిగిపోతోంది. అప్పటిదాకా, రాణి ఫీలింగ్ డ్యామ్ టూర్ లో మొదటి సారి కలిగింది. అందరితో స్నేహంగా ఉండే దివ్య ఒకేలా మాట్లాడుతుంది ద్వారితో అయినా. కానీ, టూర్ లో మాత్రం తనతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. వీరు కి మొదటి సారి దివ్య మీద కోపం వచ్చింది. దివ్యతో మాట్లాడాలని అనిపించిన ప్రతి సారి తన దగ్గరికి వెళ్ళేవాడు. కానీ, తన దగ్గరి నుండి నో రెస్పాన్స్. మిగతా ఫ్రెండ్స్ తో బిజీ గా ఉంది. అందరితో ఇలా మాట్లాడుతుంది ఏంటి అని, ఒక రకమైన చిరాకు. తన గురించి తెలిసినా, ఎందుకో ఎవరితో మాట్లాడినా ఏదో తెలియని కోపం. రెండు రోజులు ఆగి ఆలోచించాడు, తనకు ఎప్పుడూ లేనిది ఎంత కోపం ఎందుకు వస్తోంది దివ్య మీద? కొంప తీసి పోసేసివ్ గా ఫీల్ అవుతున్నానేమో అని అనిపించింది. లేదా, తన మీద దివ్య కి విసుగు వచ్చిందేమో అనే భయం కూడా అతన్ని అవహించింది. అదే ఆలోచనలో పడి, కాంటీన్ కి వచ్చి కూర్చున్నాడు. దివ్య తరువాత అంత క్లోస్ ఫ్రెండ్ చైతన్యతో పాటు వచ్చాడు. తన ఫీలింగ్స్ అన్నీ చెప్పాడు. చైతన్య ఒక్క మాటలో కొట్టి పడేసాడు. " మావా. దీన్నే లవ్ లో పడటం అంటారు " అని. " ఛాత్. అదేమి లేదు రా బాబు. ఎప్పుడు లేనిది ఈ దూరం తట్టుకోలేకపోయాను" " నీ బొంద ఏం కాదు. " " ఏంటి . నా బొంద. తనకు ఏ విషయంలోనైనా బెస్ట్ ఫ్రెండ్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *